Suresh raina joins hockey india league franchise up wizards as co owner

suresh raina, suresh raina latest news, suresh raina uttar pradesh wizards team, hockey india league, mahendra singh dhoni news, indian cricketers, suresh raina mahendra singh dhoni, suresh raina hockey team, suresh raina wizards team

Suresh Raina Joins Hockey India League Franchise UP Wizards as Co-Owner

ధోనీ అనుసరించే మార్గాలను కాపీకొట్టిన రైనా?

Posted: 11/18/2014 01:19 PM IST
Suresh raina joins hockey india league franchise up wizards as co owner

టీమిండియా ధనాధన్ కెప్టన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యవహారశైలి మిగతా ఆటగాళ్లకంటే ఎంతో భిన్నంగా వుంటుంది. అతను ఏం చేసినా అదొక సంచలనంగా నిలిచిపోవడం ఖాయం..! అది క్రికెట్ రంగంలో కావొచ్చు లేదా ఇతర కంపెనీ బ్రాండ్ లకు అంబాసిడర్ గా కొనసాగే విషయాల్లో కావొచ్చు. అంతేకాదు.. ఓవైపు క్రికెట్ తోపాటు ఇతర రంగాల్లోనూ తన బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయలను జమచేసుకుంటున్న ధోనీ ఇప్పుడు రాంచి రేస్ హాకీ జట్టుకు సహయజమానిగా వున్నాడు. మొత్తానికి ధోనీ ఏదోఒక విధంగా రకరకాల మార్గాల ద్వారా వార్తల్లోకెక్కుతుంటాడు. ఇప్పుడు తాజాగా ఇతనిలాగే రైనా కూడా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధోనీ అనుసరిస్తున్న మార్గాలను రైనా మక్కీకిమక్కీ కాపీ కొడుతున్నాడని మీడియావర్గాలు అంటున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. జాతీయక్రీడ అయిన హాకీ ఆటకు ఈమధ్య క్రేజ్ క్రికెట్ లానే పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ లాగే హాకీ ఇండియా లీగ్ ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే! రాష్ట్రాలవారీగా ఏర్పడిన హాకీ టీమ్ లను తమకిష్టమైన వాటిని కొంతమంది ప్రముఖులు కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగా ధోనీ ఇప్పటికే రాంచీ రేస్ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే! అతనిలాగే ఈ హాకీ లీగ్ లోకి యువ క్రికెటర్ సురేష్ రైనా కూడా చేరిపోయాడు. ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ జట్టుకు రైనా సహయజమానికిగా వ్యవహరించనున్నాడు.

ఈ నేపథ్యంలో రైనా మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ లాగే హాకీ క్రీడకు సేన చేయాలని అనుకుంటున్నా. యూపీ విజార్డ్స్ జట్టుతో చేరడం నేనెంతో గౌరవంగా భావిస్తున్నాను. యూపీనుంచి ధ్యాన్ చంద్, కేడీ సింగ్ బాబు లాంటి దిగ్గజ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. క్రికెట్ నుంచి విరామం లభించినప్పుడల్లా విజార్డ్స్ ఆడే మ్యాచులకు హాజరై ప్రోత్సహించాలని అనుకుంటున్నా’’ అని రైనా పేర్కొన్నాడు. ఈ విధంగా ఇతను కూడా ధోనీలాగే ఓ హాకీ జట్టుకు సహయజమానిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. అతని మార్గాలను కాపీ కొట్టాడని సెటైర్లు వేసుకుంటున్నారట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles