Sachin tendulkar shares his personal feelings after retairment with media

sachin tendulkar, sachin tendulkar latest news, sachin tendulkar interview, sachin tendulkar press meet, sachin tendulkar cricket career highlights, sachin tendulkar auto biography, sachin tendulkar playing it my way book, sachin tendulkar history

sachin tendulkar shares his personal feelings after retairment with media

24ఏళ్ల తర్వాత నా కోరికలు తీరాయి...

Posted: 11/18/2014 01:01 PM IST
Sachin tendulkar shares his personal feelings after retairment with media

ప్రపంచక్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడు సాధించని రికార్డులను తన ఖాతాలో జమచేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... ఆ క్రీడారంగంలో 24ఏళ్లు సుదీర్ఘంగా కొనసాగిన విషయం తెలిసిందే! 2011లో భారత్ వరల్డ్ కప్ తర్వాతే సచిన్ రిటైర్ ప్రకటిస్తారని అంతా భావించారు కానీ.. రెండేళ్ల తర్వాత అనుకోకుండా తన ప్రకటించేశాడు. ఆ దెబ్బతో క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాకయ్యారు కానీ.. తనకు మాత్రం అలా రిటైర్ మైంట్ ఇచ్చేసినందుకు చాలాసంతోషంగా వుందని పేర్కొంటున్నాడు. చాన్నాళ్లనుంచి అలాగే వుండిపోయిన కోరికలను తాను క్రికెట్ నుంచి విరమించుకున్న తర్వాత పూర్తిచేసుకోగలిగానని సంతోషంగా చెప్పుకుంటున్నాడు మాస్టర్!

ఆ విషయాల గురించే సచిన్ మాట్లాడుతూ... ‘‘రిటైర్ అయిన రోజే నేను హోటల్ కు వెళ్లి షాంపేన్ తాగి, హలీమ్ తిన్నాను. సాధారణంగా క్రికెట్ ఆడేరోజుల్లో ఫిట్ నెస్ దృష్ట్యా ఎక్కువ తినేవాడిని కాదు. కానీ ఆరోజు మాత్రం కడుపునిండా తిన్నాను. అప్పుడు నాకు ఎంతో తృప్తిగా అనిపించింది. క్రికెట్ ను వదిలేసినందుకు నాకు ఇప్పటికీ ఎటువంటి బాధలేదు. లార్డ్స్‌లో ఎంసీసీ తరఫున మ్యాచ్ ఆడినప్పుడు సిడిల్ బౌలింగ్‌లో వరుసగా స్ట్రయిట్ డ్రైవ్, కవర్‌డ్రైవ్‌లతో రెండు ఫోర్లు కొట్టాను. అప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది’’ అని సచిన్ తన అనుభవాలను పంచుకున్నాడు.

అలాగే తన తొలి హాలిడే గురించి మాట్లాడుతూ.. ‘‘క్రిస్‌మస్ సమయంలో లండన్‌లో ఉండాలనేది గత 20 సంవత్సరాలుగా నా కోరిక. అక్కడ జరిగే సంబరాల గురించి వినడమే కానీ, ప్రత్యక్షంగా చూడలేకపోయా. ప్రతిసారీ షెడ్యూల్ కారణంగా డిసెంబరులో ఇంగ్లండ్ వెళ్లడం కుదిరేది కాదు. రిటైరయ్యాక డిసెంబరులో లండన్ వెళ్లి క్రిస్‌మస్ సంబరాలు చూడగలిగాను. ఆ సమయంలోనే మా పిల్లల్ని తీసుకుని లండన్‌లో ఒక మ్యూజిక్ కన్సర్ట్‌కు వెళ్లా. ఆ బ్యాండ్‌కు సంబంధించిన ఒక్కపాట కూడా అంతకుముందు నేను వినలేదు. కానీ పిల్లలు అడిగారని వెళ్లాం. అప్పుడు వాళ్లతో సరదాగా కాలాన్ని ఎంజాయ్ చేశాను’’ అని తన మధురానుభూతుల్ని తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  playing it my way book  indian cricket tea  telugu news  

Other Articles