Mbati rayudu uppal stadium innings hyderabad cricket associations telugu audience

ambati rayudu, cricketer ambati rayudu, ambati tirupati rayudu news, ambati tirupati rayudu wikipedia, ambati tirupati rayudu cricket innings, indian cricket team players, india vs srilanka

mbati rayudu uppal stadium innings hyderabad cricket associations telugu audience

అవమానించినవాళ్లే... ఆహ్వానిస్తున్నారు!

Posted: 11/08/2014 01:37 PM IST
Mbati rayudu uppal stadium innings hyderabad cricket associations telugu audience

అంబటి రాయుడు... ఒకప్పుడు పరిచయం లేని ఒక క్రికెట్ క్రీడాకారుడు! జట్టులో చోటు సంపాదించుకోవడం కోసం ఇతను పడిన కష్టాలు, బాధలు, అవస్థలు అన్నీఇన్నీకావు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో శిక్షణ పొందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్క ఆటగాడూ లోకువతోనే మాట్లాడేవాడు. చివరాఖరికి కోచ్ కూడా ఇతని పట్ల వ్యంగ్యంగా ప్రవర్తించేవాడు. ‘‘వికెట్ కీపింగ్ చేస్తేనే జట్టులో చోటుంటుంది’’ అంటూ కెప్టెన్ బెదించడం.. ‘‘క్రికెట్ ఆడటం ఎలాగో తెలుసా..?’’ అంటూ సెలెక్టర్లు కసురుకోవడం.. ‘‘ఏం హీరో? సెంచరీ చేస్తావా..?’’ అంటూ కోచ్ ఎద్దేవా చేయడం... డ్రెస్సింగ్ రూమ్ అందరూ ఏకమై ఇతన్ని మాత్రమే ఒంటరివాడిని చేయడం... లాంటివి సంఘటనలు రాయుడు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఇవన్నీ జరిగిందీ ఉప్పల్ స్టేడియంలో ట్రైనింగ్ తీసుకుంటున్న సందర్భంలో!

అయితే ఇప్పుడు అదే ఉప్పల్ స్టేడియం రాయుడికోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎవరైతే అవమానించి వేరే రాష్ట్రానికి రాయుడిని పంపించేశారో.. అప్పుడు వాళ్లే సగర్వంగా ఆహ్వానించి అతనిని గౌరవపరుస్తున్నారు. ఆడిపోసుకున్న వాళ్లే అతని మ్యాచ్ చూసేందుకు ఎగబాకుతున్నారు. అతనిలో ప్రతిభ వున్నా.. అడుగడుగునా అడ్డంకులతో అట్టడుగు స్థాయికి చేరుకుని... తిరిగి ఆటతోనే అత్యున్నత స్థాయికి చేరుకున్న ఆటగాడు సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగబోతున్నాడు. అదీ అంబడి రాయుడి ప్రస్థానం. ‘‘ఎక్కడి నుంచి ఎలా వచ్చామన్నది కాదు ముఖ్యం.. టాలెంట్ నిరూపించుకున్నామా..? లేదా..?’’ అన్న డైలాగుకి మారుపేరులా నిలిచిపోయాడు రాయుడు!

హైదరాబాద్ నుంచి ఎంతోమంది క్రికెటర్లు వచ్చినా.. అందులో కొంతమందికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. అయితే సొంతగడ్డపై ఆడింది మాత్రం కేవలం ఒకే ఒక్క అజహర్! అతను చివరగా 1996లో ఎల్బీ స్టేడియంలో ఆడాడు. ఇక అప్పటినుంచి సొంతగడ్డపై ఆడిన హైదరాబాదీ ఎవ్వరు లేరు. కానీ ఈసారి 18 ఏళ్ల తర్వాత రాయుడికి ఆ ఛాన్స్ వచ్చింది. అజహర్ తర్వాత సొంతగడ్డపై ఆడిన తర్వాతి హైదరాబాదీ రాయుడే అవుతాడు. ఇప్పటివరకు 21 వన్డేల్లో రాయుడు ఆడినా.. ఇతర ఆటగాళ్ల దూకుడు ముందు రాయుడి ప్రదర్శన గొప్పగా అనిపించలేదు.

అయితే ఒక్క ఇన్నింగ్స్ అతని కెరీర్ ను మలుపు తిప్పేసింది. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో చివరివరకు బరిలోనే నిలబడి శతకం సాధించడంతో రాయుడి ప్రదర్శన ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇటువంటి ప్రదర్శనే మరోసారి ఉప్పల్ స్టేడియంలో ప్రదర్శిస్తారని అభిమానులు వేచి చూస్తున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు రాయుడు బరిలో తన ప్రతాపం మరోసారి చూపిస్తాడా..? లేదా..? అన్నది ఆదివారం మ్యాచ్ లో తేలనుంది. ఒకవేళ ఇందులో కూడా రాయుడు బాగా ఆడితే.. ఇక అతనికి మరెవ్వరూ సాటిరారు. ప్రపంచ వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశాలు మెండుగా వుంటాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles