Ambati rayudu done first century in one day matches

ambati rayudu century, ambati rayudu latest news, ambati rayudu first century, india srilanka series, india vs srilanka matche schedule, indian cricket highlights, latest sports updates, latest news

ambati rayudu done first century in one day matches : cricketer ambati rayudu completes his first century in one day format. ambati rayudu done first century on srilanka in second oneday

లంకపై రెచ్చిపోయిన రాయుడు

Posted: 11/06/2014 09:31 PM IST
Ambati rayudu done first century in one day matches

తెలుగుతేజం అంబటి రాయుడు రెచ్చిపోయాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో తన సత్తా చాటాడు. లంకేయులకు ముచ్చమెటలు పట్టిస్తూ.., మ్యాచ్ ఆడాడు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియంలో జరిగిన రెండవ వన్డేలో అంబటి శతకం పూర్తి చేశాడు. 101 బంతుల్లో 7 ఫోర్లు, 4సిక్స్ లతో సెంచరీ సాధించాడు. వన్డే సిరీస్ కెరీర్ లో అంబటి రాయడుకు ఇది తొలి సెంచరీ కావటం విశేషం. తొలి శతకం పూర్తి చేసిన తర్వాత ఉత్సాహంగా బ్యాట్ పైకి లేపి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు.

గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు..., క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదిగాడు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున పలు మ్యాచ్ లు ఆడాడు. ఆ సమయంలో ఏపీ జట్టుపై ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. అటు 2005 సంవత్సరంలో ఓ సారి ఏపీ తరపున కూడా మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టులో చేరి.., పలు మ్యాచ్ లు ఆడి జట్టు విజయానికి కృషి చేశాడు. తాజా సెంచరీ పట్ల, అంబటి సన్నిహితులు, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ వన్డే మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. నిర్ణీత యాబై ఓవర్లలో శ్రీలంక 8వికెట్ల నష్టానికి 274పరుగులు చేశారు. ఇక ఆతర్వాత బరిలోకి దిగిన భారత్ 4వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 69 పరుగుల, అంబటి రాయుడు 121 (నాటౌట్) పరుగులు, విరాట్ కొహ్లీ 49 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఇలా ఒకే మ్యాచ్ తో టీం ఇండియా డబుల్ ధమాకా అందించింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambati rayudu  srilanka  first century  latest news  

Other Articles