Jharkhand government removed z category security to dhoni

mahendra singh dhoni, z category security, mahendra singh dhoni latest news, jharkhand government, dhoni z category security

Jharkhand government removed z category security to dhoni : Jharkhand government removed z category security and providing y category in which only seven officers will secure him.

ధోనీ తోక కోసేశారు!

Posted: 08/12/2014 01:36 PM IST
Jharkhand government removed z category security to dhoni

ప్రస్తుతం మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి దెబ్బమీదదెబ్బ తగులుతోంది. వరుసగా టెస్ట్ మ్యాచుల్లో ఘోరంగా విఫలం కావడం వల్ల ఈయనను ప్రపంచం దిగ్గజ క్రికెటర్లందరూ ఈయన్ను ఘోరంగా అవమానించేస్తున్నారు. మొన్నటికి మొన్న ధోనీలాంటి ఆటగాడు ఎక్కడా దొరకడు అని నెత్తికెత్తుకుని కూర్చున్నవారే ఇప్పుడు ధోనీని తిట్టపారేస్తున్నారు. టీమ్ ను మేనేజ్ చేయడంలో ధోనీ దారుణంగా విఫలం అయ్యాడంటూ ఆయన మీద విమర్శలు చేస్తున్నారు.

ఇదిలావుండగా.. ధోనీ మన భారతీయ మాజీ కెప్టెన్లు సాధించిన అతిచెత్త రికార్డులను దాటేసి మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అజారుద్దీన్, గంగూలీ వంటి మాజీ కెప్టెన్లు సారధ్యంలో టీమిండియా పదేసి టెస్ట్ మ్యాచుల్లో ఓడిపోయిన ఘనతను సాధిస్తే.. ధోనీ 13 మ్యాచులతో ముందున్నాడు. మరో మూడు టెస్టు మ్యాచుల్లో ధోనీ ఇదే తీరును కనబరిస్తే.. అంటే ఓడిపోతే.. ప్రపంచంలో వున్న చెత్త కెప్టెన్ల జాబితాలోకి ఫస్ట్ ర్యాంక్ ను ఆక్రమించుకోవడం ఖాయం. గతంలో ఫ్లెమింగ్, బ్రియాన్ లారాలు 16 మ్యాచుల్తో ముందున్నారు. ఇప్పుడు ధోనీ 13 ఓడిపోయాడు. ఇంకో మూడు మ్యాచులు ఓడితే.. వారి స్థానంలో ధోనీ వుండటం ఖాయం!

ఇలా రకరకాలుగా ధోనీ మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో... జార్ఖండ్ ప్రభుత్వం ఈయన చెంప ఛెళ్లమనిపించే విధంగా కొన్ని నియమాలను విధించింది. గతంలో ఈయనకు ముప్పు వుందనే సమాచారం రావడంతో అప్పట్లో ఆయనకు ప్రత్యేకంగా వీవీఐపీలకు కల్పించే జెడ్ - కేటగిరి భద్రతను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఆయనకు ఎలాంటి ముప్పులేదని, ఆయన అందించిన భద్రతను తగ్గిస్తున్నామని సదరు ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పోలీస్ అధికారి రాజీవ్.. వీఐపీలకు ఏర్పాటు చేస్తున్న భద్రతపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ధోనీకి భద్రత తగ్గించామని ఆయన పేర్కొన్నాడు. ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.

ఇంతవరకు ధోనీకి తొమ్మిదిమందితో కూడిన ‘‘జెడ్’’ కేటగిరి సిబ్బంది వుండేది. ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ధోనీ భద్రత ‘‘వై’’ కేటగిరిగా మారిపోయింది. ఇందులో ఏడుగురు పోలీసు సిబ్బంది భద్రతగా వుంటారు. అంటే కేవలం ఇద్దరూ సిబ్బంది మాత్రమే తగ్గినట్లన్నమాట! అయితే ఈ విధంగా ధోనీపై తీసుకున్న ఈ నిర్ణయం మేరకు కొంతమంది విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘కేవలం టెస్టు మ్యాచుల్లో ఓడిపోయినందుకే ధోనీ మీద చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ’’ కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది.. ‘‘ప్రస్తుతం ధోనీ తీరు ముందుకంటే చాలా మారింది. జట్టును పటిష్టం చేయలేకపోతున్నాడు. ధోనీని తీసేయాల్సిందేనని’’ మరికొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ధోనీకి రానురాను ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో!!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles