Dhoni chides top order batsmen for poor show

Mahendra Singh Dhoni, Dhoni chides top-order batsmen, Dhoni chides top-order, England, Manchester, Team India, Fourth Test, Old Trafford Stadium, MS Dhoni, ఇంగ్లాండ్, టీమిండియా, ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానం, మాంచెస్టర్, నాలుగో క్రికెట్ టెస్టు, మహేంద్ర సింగ్ ధోని,

Skipper Mahendra Singh Dhoni blasted his top-order Dhoni chides top-order batsmen for poor show: batsmen for their spineless show after India slumped to a humiliating innings and 54-run

అవును నిజమే! కొంప మునిగింది : ధోని

Posted: 08/10/2014 01:55 PM IST
Dhoni chides top order batsmen for poor show

అవును నిజమే మీరు చెప్పినట్టే.. మా కొంప మునిగిందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ స్వయంగా ఓప్పుకున్నాడు. అంటే ఆయన సొంత కొంప మునగలేదు లేండి? కేవలం కొత్త ప్రయోగం చేసి విఫలమయ్యం అని ధోనియే ఓప్పుకున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యమే తమ కొంప ముంచిందని ధోని వాపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మూడంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరగడంతో తాము ఘోరంగా ఓడిపోయామని చెప్పాడు.

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో విజయం సాధించడంతో టాప్ ఆర్డర్ ఆటగాళ్ల వైఫల్యం కనపించకుండాపోయిందని, మరిన్ని పరుగులు చేయాల్సిందని వారికి చెప్పలేని పరిస్థితి తలెత్తిందన్నాడు. తమ ఐదో బౌలర్ చేసినన్ని పరుగులు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్ మన్ సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగులతో చిత్తుగా ఓడింది. తొలి ఇన్నింగ్సలో భారత్ 8 పరుగలకే 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు.

అయినా ఓడిపోయినప్పుడు .. బాధపడటం, గెలిచినప్పుడు ఆనందపడటం మనకు అలవాటే. అయినా ఘోరంగో ఓడిపోవటం తలచుకుంటే తిన్నది మొత్తం బయటకు వస్తుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఏమైన ధోనీ కొంచెం జాగ్రత్త ఆడాల్సిందని ఆయన అభిమానులు ఉచిత సలహాలు ఇస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india cricket news  Mahendra Singh Dhoni  latest cricket news  team india  

Other Articles