Kings xi punjab playoff spot confirm

Delhi Daredevils,IPL 2014,IPL 7,Kings XI Punjab, Delhi Daredevils, Indian Premier League, Kings XI Punjab, ipl2014news, IPL 7

Kings XI Punjab chased down the target of 165 in a last over finish with four wickets in hand against Delhi Daredevils.

తొలిసారి ప్లే ఆఫ్ లోకి పంజాబ్

Posted: 05/20/2014 09:57 AM IST
Kings xi punjab playoff spot confirm

ఐఫీఎల్ ప్రారంభం అయినప్పటి నుండి పేవలమైన ప్రదర్శనతో గత ఆరు సీజన్లలో ప్లే ఆఫ్ కి చేరకుండా వెనుదిరిగిన పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టు ఈసారి ఎటువంటి అంచనాలు లేకుండా గత ఛాంపియన్స్ జట్లతో సహా స్టార్ ఆటగాళ్ళు ఉన్న జట్లను మట్టికరిపిస్తూ ప్లే ఆఫ్ బెర్త్ ని అందరి కంటే ముందుగా ఖాయం చేసుకుంది.

ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్ మురళీ విజయ్ 5 పరుగులకే వెనుదిరిగినా మరో ఓపెనర్ కెవిన్ పీటర్సన్ (49) రాణించాడు. దినేష్ కార్తీక్ (69) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు డుమినీ 17 పరుగులు చేశాడు. 

అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగా ఆరు వికెట్లకు విజయతీరాలకు చేరింది. ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్ (23), మనన్ వోహ్రా (42) రాణించారు. కాగా సూపర్ ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ 14 పరుగులకు వెనుదిరిగాడు. చివర్లో అక్షర్ పటేల్ (42 నాటౌట్) రాణించి జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లు సందీప్ శర్మ, హెండ్రిక్స్ మూడేసి వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles