Knight riders beat sunrisers by 7 wickets

Knight Riders beat Sunrisers, Sunrisers defeat by 7 wickets, Sunrisers Hyderabad, Kolkata Knight Riders

Kolkata Knight Riders all-round brilliance helped them defeat Sunrisers Hyderabad by seven wickets.

హైదరాబాద్ ఆశలు నిర్జీవం-కోల్ కత్తా ఆశలు సజీవం

Posted: 05/19/2014 11:11 AM IST
Knight riders beat sunrisers by 7 wickets

గత సీజన్లో సొంత గడ్డ అచ్చొచ్చిన హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్లో అస్సలు అచ్చరావడం లేదు. గతంలో తక్కువ స్కోర్లతో విజయాలు అందుకున్న ఈ జట్టు, ఈ సీజన్లో ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన అచ్చిరావడం లేదు. వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకశాలను సంక్లిష్టం చేసుకుంది. కోల్ కత్తాతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓటమి 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధవన్ 19, నమన్ ఓజా 22, డేవిడ్ వార్నర్ 34, ఇర్ఫాన్ పఠాన్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కోల్కతా బౌలర్లు ఉమేష్ మూడు, షకీబల్ రెండు వికెట్లు తీశారు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా మరో రెండు బంతులు మిగిలుండగా మూడు వికెట్లకు విజయతీరాలకు చేరింది. రాబిన్ ఊతప్ప 40, మనీష్ పాండే 35, యూసుఫ్ పఠాన్ 39 (నాటౌట్), టెన్ డస్కాటే 25 (నాటౌట్) పరుగుల చేశారు. ఉమేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles