Virat ton ensures draw for india new zealand win series

Virat Kohl, India vs New Zealand, Second Test, Virat Kohli smashed his sixth Test

virat ton ensures draw for india new zealand win series

సెంచరీతో రెండో టెస్ట్ డ్రా చేసిన విరాట్

Posted: 02/18/2014 08:11 PM IST
Virat ton ensures draw for india new zealand win series

 భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను కివీస్ 1-0తో గెల్చుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. 

విరాట్ కోహ్లి(105) సెంచరీతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 31 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. మురళీ విజయ్ 7, పూజారా 2, ధావన్ 17 పరుగులు చేసి అవుటయ్యారు. 571/6 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట ప్రారంభించిన కివీస్ 680/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 

బ్రెండన్ మెకల్లమ్‌(302) ట్రిఫుల్ సెంచరీ సాధించాడు. నీషామ్(137) శతకంతో అజేయంగా నిలిచాడు. బ్రెండన్ మెకల్లమ్‌ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles