టిమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో చురకల సౌండ్ వినిపించారు. ధోనీ ప్రవర్తిన తీరు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ధోని ఒత్తిడి సమయంలో సైతం ప్రశాంతంగా ఉండడం, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం వంటి లక్షణాలు ధోనీ కెప్టెన్సీకి వన్నెతెచ్చాయి.
కానీ, న్యూజిలాండ్ తో రెండో టెస్టులో పరిణామాలు కెప్టెన్ కూల్ కి సైతం చిరాకు తెప్పించాయి. నాలుగో రోజు ఆటలో రోజంతా బౌలింగ్ చేసి ఒక్క వికెట్టే తీయడంపై ధోనీ ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఓ దశలో రాంగ్ లైన్ లో బంతులు విసురుతున్న బౌలర్ రవీంద్ర జడేజాకు చురకలంటించాడు.
తాను షార్ట్ పొజిషన్ లో పుజారాను ఫీల్డింగ్ కు పెట్టింది చప్పట్లు కొట్టేందుకు కాదని జడేజాకు స్పష్టం చేశాడు. దానర్థం పుజారా వద్దకు క్యాచ్ లు వేళ్ళే విధంగా బంతులు విసరాలన్నది ధోనీ అభిప్రాయం.
'పుజారా కో వహా తాలీ బజానే కేలియే నహీ రఖా!' అని ధోనీ అనడం స్టంప్ మైక్రోఫోన్ ద్వారా స్పష్టంగా వినపడింది. ఇక, తొలి ఇన్నింగ్స్ లో వికెట్ల పండగ చేసుకున్న ఇషాంత్ రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్టూ తీలేకపోయాడు.
తన బౌలింగ్ ను ఊచకోత కోసిన కివీస్ కెప్టెన్ మెకల్లమ్ ను ఇషాంత్ దూషించడం కూడా మైక్రోఫోన్ ద్వారా వినిపించింది.
మాజీ ప్రేయసితో పెంచిన మసాలా ఘాటు
లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తన మాజీ ప్రేయసి ఎలిజబెత్ హర్లేతో రెండో ఇన్నింగ్స్ కు సిద్ధమవుతున్నట్టుంది. ఏడాదిగా ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరూ ఇటీవలే లండన్ లో కెమెరా కంటికి చిక్కారు.
దీంతో, ఈ ప్రేమ పక్షులు తమ విరహవేదనకు చెక్ పెట్టాయనుకోవచ్చేమో. భార్యకు విడాకులిచ్చి వార్న్.. భర్తకు గుడ్ బై చెప్పి హర్లే.. ఏళ్ళతరబడి డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎందుకనో వీరి ప్రేమాయణం బెడిసికొట్టింది. దీంతో, గత సంవత్సరం చెరోదారి పట్టారు. అప్పట్లో వీరి లవ్ ఎఫైర్ బ్రిటిష్ టాబ్లాయిడ్లకు మాంచి మసాలా అందించేది.
బహిరంగంగానే అధర చుంబనాలు, హోటల్ గదుల్లో 'సుదీర్ఘ మంతనాలు'.. అన్నీ కూడా పతాక శీర్షికలకెక్కేవి. వీరు విడిపోయినప్పటి నుంచి కాసింత నిదానించిన టాబ్లాయిడ్లు తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో దొరికేసరికి రెచ్చిపోయాయి.
నటి, మోడల్ అయిన హర్లే.. భారత్ కు చెందిన పారిశ్రామికవేత్త అరుణ్ నాయర్ ను వివాహమాడి కొద్ది నెలలకే విడాకులచ్చింది. అప్పట్లో భారత్ లో జరిగిన వీరి వివాహంపై మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more