2nd test day 3 nz 6 runs ahead

brendon mccullum, bj watling, zaheer khan, mohammad shami, india, new zealand,

158-run unbroken stand helps NZ erase India 246-run lead, taking the hosts to 252/5 in their second innings of the 2nd Test.

పట్టుకోసం ప్రయత్నిస్తున్న కివీస్

Posted: 02/16/2014 12:43 PM IST
2nd test day 3 nz 6 runs ahead

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత కుర్రాళ్లు మొదటి రోజు బౌలింగ్ లో, రెండో రోజు బ్యాటింగ్ లో అదరగొట్టి కివీస్ పై ఆధిక్యంతో పాటు , టెస్టు పై పట్టుసాధించారు. కానీ మూడో రోజు అంతంత మాత్రమే ప్రదర్శన చేయడంతో టెస్టు రసపట్టులోకి వెళ్లింది. రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆది లోనే వికెట్ కోల్పోయింది.

మూడో రోజు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాట్స్ నిలకడగా ఆడుతూ రోజంతా ఆడి కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి 252 పరుగులు చేసి భారత్ పై 6 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 114 పరుగులతో మెక్కల్లామ్, 52 పరుగులతో వాట్లింగ్ నాట్ ఔట్గా ఉన్నారు. లధమ్ 29, రూధర్ ఫర్డ్ 36 పరుగులు చేశారు.

భారత జట్టు జహీర్ ఖాన్ 3 వికెట్లు, మహ్మద్ షమ్మి, జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు. నాలుగో రోజు కనుక భారత బౌలర్లు విజృంభిస్తే మ్యాచ్ గెలవడం లాంఛనమే. వికెట్లు తీయకపోతే మాత్రం ఈ టూర్ లో ఒక్క మ్యాచ్ గెలవాలన్న కోరిక కలగానే మిగిలిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles