Virender sehwag retention doubtful

IPL, Virender Sehwag, Quinton de Kock, Corey Anderson, ipl2014news, IPL 2014 auctions, Delhi Daredevils

Virender Sehwag string of poor scores in domestic cricket is likely to affect his chances of bagging a lucrative deal in the IPL 7 as it looks highly unlikely that he would be retained by his current franchise Delhi Daredevils.

సెహ్వాగ్ ఐపీఎల్ కెరియర్ క్లోజ్ ?

Posted: 01/04/2014 12:30 PM IST
Virender sehwag retention doubtful

భారత స్టార్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ గత కొంత కాలం నుండి ఫేవల ఫాంని కొనసాగిస్తుండటంతో సెలక్షన్ కమిటీ అతన్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. కనీసం రంజీల్లోనైనా రాణించి మళ్లీ జట్టులోకి వస్తాడనుకుంటే అక్కడ కూడా విఫలం కావడంతో వీరు ఇక భారత జట్టును వీడేందుకు సమయం ఆసన్నమైందనే ప్రచారం మొదలైంది.

అంతర్జాతీయ జట్టుకు దూరం అయినా సీజన్ క్రికెట్ ఐపీఎల్ ద్వారా ఆదాయాన్ని పొందుదామనుకున్న ఆయనకు నిరాశే ఎదురైయ్యేట్లు కనిపిస్తుంది. ఐపీఎల్ లో గత ఆరు సీజన్ల నుండి ఢిల్లీ జట్టుకు ఆడుతున్న వీరేంద్ర సెహ్వాగ్ పెద్దగా పొడిచిందేమి లేదు. స్టార్ ఆటగాడి హోదాలో భారీ పారితోషికాన్ని అర్జించిన ఇతని పై , అతని ఫాం పై జట్టులోని సభ్యులు  అసంత్రుప్తితో ఉండటంతో అతని స్థానంలో వేరే వాళ్లని తీసుకోవాలని భావి ఈ సీజన్ నుండి వదిలించుకోవాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తొందని సమాచారం.

ఒకవేళ ఇతని పై నమ్మకాన్ని ఉంచి జట్టు యాజమాన్యం ఉంచుకోదలిస్తే.... ఈనెల 10 వ తేదీలోపు వారి జాబితాను ఐపీఎల్ యాజమాన్యానికి సమర్పించాలి. ఆ జాబితాలో వీరు పేరు ఉండటం కష్టమే అంటున్నారు. గత కొన్ని సీజన్ల నుండి ఘోరంగా విఫలం అవుతున్న ఢిల్లీ జట్టు ఈ సారి ఎలాగైనా పుంజుకోవాలని, అందుకు కొత్త వారిని తీసుకోవాలని భావిస్తుంది. ఢిల్లీ జట్టుకు చెందిన ఓ అధికారి వీరూ స్థానంలో వార్నర్ లాంటి వాళ్ళను తీసుకోవడం బెటర్ అని చెప్పడం చూస్తుంటే వీరుకి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles