Ankush bains bats india into u19 asia cup final

India into U19 Asia Cup final, India beat Sri Lanka by three wickets, Ankush Bains, Pakistan, cricket

India qualified to play against Pakistan in the final of the Asian Cricket Council Under-19 Asia Cup when they defeated Sri Lanka.

అండర్ -19 జట్టు ఫైనల్లో

Posted: 01/03/2014 01:32 PM IST
Ankush bains bats india into u19 asia cup final

ఒకవైపు టీం ఇండియా జట్టు విదేశీ గడ్డ పై విఫలం అయి తిరిగొస్తే... అండర్ 19 జట్టు మాత్రం ఆసియా కప్ లో దూసుకుపోతుంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో పాకిస్థాన్ తో అమితుమీ తేల్చుకోవడానికి సిద్దం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దుమిందు (60), కుశాల్ మెండిస్ (52) తో రాణించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ ఓ దశలో 127 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడితే.. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అయిన అంకుశ్ బైన్స్ 54 పరుగులు, కులదీప్ (22) పరుగులతో ఏడో వికెట్ కి 58 పరుగులు చేసి భారత్ ని విజయ తీరాలకు చేర్చారు. చివర్లో 11 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితిలో బైన్స్ 49వ ఓవర్లో ఔటయ్యాడు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఈ తంతును పూర్తి చేసి భారత్ కి విజయాన్ని అందించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles