Icc world twenty20 to be shifted to india

Eden Gardens Kolkata, Bangladesh, Ranchi, ICC World T20 2014, wt202014news

Political unrest in Bangladesh may force the ICC World Twenty20 to be shifted to India.

ఇండియాలో 2014 టి20 వరల్డ్ కప్

Posted: 12/25/2013 10:11 AM IST
Icc world twenty20 to be shifted to india

వచ్చే ఏడాది జరగనున్న మినీ వరల్డ్ కప్ టి-20 టోర్నీ మన దేశంలోనే జరగనుందా ? బంగ్లాదేశ్ లో జరగనున్న ఆ టోర్నీ వేదిక మారి మనదేశానికి రానుందా ? అంటే అక్కడ పరిస్థితులను బట్టి అవుననే అనిపిస్తుంది. బంగ్లాదేశ్ లో రాజకీయ అశాంతి నెలకొనడంతో టి-20 ప్రపంచకప్ వేదికను ఐసీసీ భారత్ కు మార్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

వాస్తవానికి బంగ్లాదేశ్ లోని మిర్పూర్, చిట్టగాంగ్, సిల్ హెట్ లలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఐతే టోర్నీకి కోలకత్తా, రాంచిలను స్టాండ్ బైలుగా ఉంచినట్లు సమాచారం. త్వరలో ఢాకాలో జరిగే సమావేశంలో ప్రపంచకప్ ను బంగ్లాదేశ్ నుండి తరలించాలో లేదో నిర్ణయిస్తారు.

ఇక మన దేశంలో జరగాల్సిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని శ్రీలంకకు లేదా దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరి టి20 విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles