Been there done that shikhar dhawan

Shikhar Dhawan, South Africa tour, Mitchell Johnson, India A team, MS Dhoni, India vs South Africa

Shikhar Dhawan has had a dream run this year so far. Can he make it better on the lively track in South African while facing world-class pacers

సఫారీలకు శిఖర్ ధావన్ సవాల్

Posted: 11/30/2013 01:08 PM IST
Been there done that shikhar dhawan

గత కొన్ని రోజులుగా భారత జట్టు వరుస విజయాలతో మంచి ఊపులో ఉంది. స్వదేశంలో మంచి మంచి జట్లను బోల్తా కొట్టించి, భారీ లక్ష్యాలను కూడా చేధించిన భారత జట్టు ఆడిందే ఆటగా సాగింది. మందకొడి పిచ్‌లు, టన్నుల కొద్దీ పరుగులు, పేరుకే తప్ప వేగం లేని ఫాస్ట్ బౌలింగ్. కానీ ఇకపై బౌన్సీ పిచ్‌లు, హడలెత్తించే పేస్, ప్రతీ బంతికి పోరాటం... రాబోయే రోజుల్లో టీమిండియాకు ఇలాంటి సవాళ్లు ఎదురు కానున్నాయి. త్వరలో సౌతాఫ్రికా టూర్ కి రెడీ అవుతున్న ఈ భారత జట్టు గత పర్యటనలో భారీ పరాజయాల్ని చవిచూసి అపకీర్తిని మూటగట్టుకొని వచ్చింది.

అయితే సారి అలా కాకుండా ఉండేందుకు మానసికంగా సిద్దం అవుతుంది. కొత్త కుర్రాళ్లు, విదేశీ పిచ్ ల పై అనుభవం ఉన్న ఆటగాళ్ళు లేకపోవడం భారత్ ని కాస్త ఆందోళనకు గురి చేస్తున్నా... టీం ఇండియా ఆటగాడు ధావన్ మాత్రం సఫారీలకు సవాల్ విసురుతున్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్, బౌన్సీ వికెట్లకు టీమ్ ఇండియా భయపడదని , ఆ జట్టుకు గట్టి పోటీ ఇస్తామని అన్నాడు. తన బ్యాటింగ్ శైలికి బౌన్సీ ఫిచ్ లే సరిపోతాయని, వానినే నేను ఎక్కువగా ఇష్టపడతానని అంటున్నాడు. దక్షిణాఫ్రికాలో రాణించి సిరీస్ ని గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles