Carlsen defeats viswanathan anand

World Chess Championship, Magnus Carlsen, Viswanathan Anand, Chess championship, Chess, World chess champion, World chess

Magnus Carlsen of Norway on Friday became the new world chess champion after defeating maestro Viswanathan Anand.

చెస్ లో కొత్త ప్రపంచ ఛాంపియన్ కార్ల్ సన్

Posted: 11/23/2013 01:37 PM IST
Carlsen defeats viswanathan anand

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో కొత్త శకం ప్రారంభం అయింది. గత ఆరేళ్ళుగా చెస్ సామ్రాజ్యంలో రారాజుగా ఉన్న మన భారతీయుడు విశ్వనాథ్ నాధ్ ఆనంద్ ను చిత్తు చేసి 22 సంవత్సరాల నార్వే కుర్రాడు విశ్వ విజేతగా నిలిచాడు. టోర్నీ ఆరంభం నుండి రికార్డు రేటింగ్ తో ఫేవరెట్ గా బరిలో దిగిన కార్ల్ సన్ గురి తప్పలేదు. అత్యాధునిక చెస్ లో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో కార్ల్ సన్ 6.5 ,3.5 తేడాతో ఆనంద్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించాడు.

ఐదు పర్యాయాలు టైటిల్ సాధించిన డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో తలపడిన కార్ల్‌సెన్ పదో గేమ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా, విజయానికి అవసరమైన 6.5 పాయింట్లను చేరుకున్నాడు. 12 గేమ్స్ జరిగే ఈ పోటీల్లో మూడు పరాజయాలు ఎదుర్కొన్న ఆనంద్ చివరి మూడు గేమ్స్‌ను గెలవడం తప్పనిసరిగా మారింది. తీవ్రమైన ఒత్తిడితో పదో గేమ్‌లో బరిలోకి దిగిన అతను 65 ఎత్తులు పోరాడినప్పటికీ లాభం లేకపోయింది.

2010 నుంచి అత్యధిక ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ కార్ల్‌సెన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్ ఇప్పటి వరకూ దక్కలేదు. అనధికారికంగా విశ్వవిజేతగా ఉన్న అతను ఇప్పుడు పూర్తి స్థాయి చాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెల్చిన అతిచిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more