జింబాంబ్వే పర్యటనకు వెళ్లే ముందు భారత కుర్రాళ్ల పై చిన్న సందేహం గతంలో ట్రై సిరీస్ లో ఆ జట్టు పై ఓడి పోయి ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టిన టీంఇండియా ఈసారి ఏం చేస్తుందోనని. కానీ ఆ సందేహాల్ని పటా పంచలు చేస్తూ తొలి రెండు వన్డేల్లో నెగ్గిన కుర్రాళ్ళు మూడో వన్డేలో కూడా తన పూర్తి స్థాయి ప్రదర్శనతో ఘన విజయం సాధించి మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే సెల్ కాన్ మొబైల్ కప్ సిరీస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తొలి రెండు వన్డేల్లో ఉన్న లోపాలను సరిద్దిద్దుకొని మూడో వన్డేలో తిరుగులేని ఆధిపత్యం చలాయించారు. ఆదివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన మూడో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను కోహ్లి సేన 3-0తో నెగ్గినట్టయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 46 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటయ్యింది. విలియమ్స్ (53 బంతుల్లో 45; 2 ఫోర్లు; 1 సిక్స్), మసకద్జా (53 బంతుల్లో 38; 5 ఫోర్లు) మాత్రమే రాణించారు. మిశ్రా తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు తీసి జింబాంబ్వేను దెబ్బతీశాడు. షమీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 35.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి నెగ్గింది. ధావన్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు), రాయుడు (54 బంతుల్లో 33; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడగా చివర్లో రైనా (18 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అమిత్ మిశ్రాకు దక్కింది. నాలుగో వన్డే ఆగస్టు 1న బులవాయోలో జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more