జింబాబ్వే పర్యటనలో భారత కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు దక్కించుకుని దూసుకెళుతున్నారు. ఇలా చూస్తే అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో లోపం కనిపిస్తోంది. అదే బౌలింగ్ విభాగం. సిరీస్‌కు ముందు పసికూనలుగా భావించిన జింబాబ్వే జట్టు మైదానంలోకి దిగాక మరీ పేలవంగా మాత్రం ఆడటం లేదు. కచ్చితంగా వారు పటిష్ట భారత జట్టుకు పోటీనిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో వారు ఆలౌట్ కాకుండా పూర్తి ఓవర్లు ఆడగలిగారు. 200కు పైగా పరుగులు సాధించగలిగారు. అంటే ఓ విధంగా కోహ్లి సేనను సమర్థంగా ఎదుర్కొన్నట్టే. ఈ విభాగం మరింత మెరుగుపరుచుకుంటే తప్ప భారత్‌కు స్థాయికి తగ్గ విజయం దక్కదు. బ్యాటింగ్ ఆర్డర్ దుమ్ము రేపే ఆటతీరుతోనే జట్టుకు విజయాలు దక్కుతున్న విషయం అంగీకరించాల్సిందే. ఈ నేపథ్యంలో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగే మూడో వన్డేలో తమ బౌలింగ్ సత్తా చూపేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ వన్డే నెగ్గితే 3-0తో సిరీస్ దక్కుతుంది. ఇదే జరిగితే కెప్టెన్‌గా తొలిసారి విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించినట్టవుతుంది మరోవైపు తమ లోపాలను సరిదిద్దుకుంటూ ఈ మ్యాచ్‌లోనైనా విజయాన్ని దక్కించుకోవాలని జింబాబ్వే చూస్తోంది. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్‌లో రాణించడం లేదు. రాయుడు, దినేశ్ కార్తీక్ చెరో అర్ధ సెంచరీ సాధించారు. ఇక జట్టును ఆందోళన పరుస్తున్న బౌలింగ్ విభాగంలో పేసర్లు వినయ్ కుమార్, మహ్మద్ షమీ ప్రత్యర్థిని ఏమాత్రం కట్టడి చేయడం లేదు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more