ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే (బూడిద కప్పు) యాషెస్ సిరీస్ అంటే ఆ రెండు జట్లు చిన్న పాటి ప్రపంచకప్ ఆడుతున్నట్లుగా భావిస్తాయి. నిన్ననే ఈ రెండు జట్ల మధ్య ప్రారంభం అయిన ఈ సిరీస్ కి సంచలన ఆరంభం లభించింది. ఆసీన్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ వచ్చిన వారు వచ్చినట్లే పెవీలియన్ ధారి పట్టారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 215 పరుగులకే ఆలౌట్ అయింది. తరువాత తన మొదటి ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ కూడా వచ్చిన వారు వచ్చినట్లే క్యూ కట్టారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. దీంతో మొదటి రోజు 14 వికెట్లు పడ్డాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ లో ట్రాట్ (80 బంతుల్లో 48; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... బెయిర్ స్టో (37), రూట్ (30), బ్రాడ్ (24) కొద్ది సేపు ప్రతిఘటించగలిగారు. మిగతా వారు ఆసీస్ బౌలర్ల ధాటికి నిలవలేక పోయారు. పీటర్ సిడిల్ (5/50) తో ఇంగ్లాండ్ ని చావు దెబ్బ కొట్టడానికి తోడు ప్యాటిన్సన్ (3/69), స్టార్క్ (2/54) రాణించారు. ఇక ఆసీస్ కూడా ఆరంభంలో చకచకా స్టీవెన్ ఫిన్ ధాటికి వాట్సన్ (13), కొవాన్ (0) వెనుదిరగ్గా...ఆ తర్వాత క్లార్క్ (0), రోజర్స్ (16) అండర్స్ పెవీలియన్ పంపించాడు. 75 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ ప్రస్తుతం 114 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more