ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా విండీస్ లో పోర్ట్ స్పెయిల్ లో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్లో కి దూసుకెళ్లింది. విండీస్ లో అడుగు పెట్టి మొదటి రెండు మ్యాచ్ ల్లో వరుస ఓటములలో కూరుకుపోయిన భారత్ తరువాత పుంజుకొని వరుస విజయాలతో దూసుకుపోయి ఫైనల్ చేరింది. నిన్న రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ని 26 ఓ వర్లకు కుదించి డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం శ్రీలంకకు 178 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 24.4 ఓవర్లలో 96 పరుగలకు అలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్ చేపట్టింది. మ్యాచ్ 29 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కురియడంతో ఆటను నిలిపివేశారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 48 పరుగులతో నాటౌట్ గా నిలువగా, ధావన 15, కోహ్లి 31, కార్తీక్ 12 పరుగులు చేసి అవుటయ్యారు.
తరువాత బ్యాటింగ్ కి దిగిన లంకేయులు ఏ మాత్రం పోరాడే ప్రయత్నం చేయలేదు. భారత బౌలర్ల ధాటికి వచ్చిన వారు వచ్చినట్లు పెవీలియన్ బాట పట్టారు. ఆ జట్టులో చండీమాల్ అత్యధికంగా (26) మాత్రమే రాణించే ప్రయత్నం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ, జడేజా రెండేసి వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. శ్రీలంకపై విజయంతో భారత జట్టు 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు జట్లు రెండు మ్యాచ్ లో చొప్పున రెండేసి గెలవడంతో నెట్ రన్ రేట్ ఆధారంగా భారత్ శ్రీలంక ఫైనల్ చేరగా విండీస్ టోర్నీ నుండి నిష్ర్కమించింది. భువనేశ్వర్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more