సొంత గడ్డ పై తమకు తిరుగులేదని నిరూపించుకుంది ముంబై జట్టు. ఈ సీజన్ లో అగ్రజట్లుగా చెలామణి అవుతున్న రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో చివరికి ముంబై పై చేయి సాధించింది. ఈ విజయంతో ముంబై అగ్ర స్థానంలో నిలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ జట్టు ముంబైని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఆట ప్రారంభం నుండే ముంబై బ్యాట్స్ మెన్స్ తన జోరును కొనసాగించారు. ముంబై కొత్త ఓపెనర్లుగా బరిలోకి దిగిన తారే -మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మ్యాక్స్ వెల్ త్వరగానే వెనుదిరిగినా, తరువాత దినేష్ కార్తీక్ తో కలిసి తారే తన ప్రతాపాన్ని చూపించాడు. మొత్తం 37 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 59 (అర్ధ శతకం) పరుగులు సాధించి వెనుదిరిగాడు. కార్తిక్ (21) , శర్మ (14), పొలార్డ్ (17), హర్బజన్‌సింగ్ (15) రాణించి జట్టు స్కోరును 20 ఓవర్లలో 166కు చేర్చారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు ద్రవిడ్ (4), రహనే (4)తో పాటు ఫౌల్క్‌నర్ (12), సామ్‌సన్ (4).. ఇలా వరుసబెట్టి వికెట్లు కోల్పోవడంతో రాయల్స్ కష్టాల్లో పడింది. వాట్సన్ (19) , హోడ్జ్ (39), బిన్నీ నిలకడగా ఆడి 158 పరుగులకు చేర్చినా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయింది. అనుభవజ్ఞుడైన ముంబై బౌలర్ మలింగాను ఎదుర్కొని పరుగులు సాధించడం చివరి ఓవర్‌లో యాగ్నిక్, కూపర్‌లకు సాథ్యం కాలేదు. దీంతో రాజస్థాన్‌కు 14 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన తారే అద్బుత బ్యాటింగ్ చేసినందుకు గాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more