ఐపీఎల్ సీజన్ 6లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అపజయాల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించింది. ఇంత వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓడి అపకీర్తి మూటగట్టుకుంది. మొన్న బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో పోరాట పటిమను కనబర్చిన ఢిల్లీ జట్టు నిన్న రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కనీస పోటీ ఇవ్వకుండా ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఢిల్లీకి నాకౌట్ చేరే అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి. ఢిల్లీలోని ఫిరోషా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 83 పరుగులకే కుప్పకూలి 86 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 169 భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మైకల్ హస్సీ 50 బంతుల్లో 65 పరుగులతో వీర విహారం చేయడంతో పాటు ధోని 23 బంతుల్లో 44 పరుగులు చేయడంతో చెన్నై కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ లక్ష్యచేధనకు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. వచ్చిన బ్యాట్స్ మెన్స్ వచ్చినట్లే పెవీలియన్ కి క్యూ కట్టడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 17.3 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం పాలైంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more