పేలవ ఫామ్ లో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ వన్డే కెరీర్ ఇక ముగిసినట్లేనేమో? డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసిందా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో... బీసీసీఐ మరో బాంబు పేల్చింది. 30 మంది సభ్యుల చాంపియన్స్ ట్రోఫీ ప్రాబబుల్స్ జాబితాలో సెహ్వాగ్‌కు చోటు దక్కలేదు. వీరూతో పాటు పేసర్ జహీర్ ఖాన్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లపై కూడా వేటు వేశారు. ఆశ్చర్యకరంగా చతేశ్వర్ పుజారా, ప్రజ్ఞాన్ ఓజాలను కూడా వదిలేశారు. జమ్మూకాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇటీవల టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన గంభీర్‌కు మాత్రం తిరిగి చోటు కల్పించారు. పలువురు యువ క్రికెటర్లకూ అవకాశం లభించింది. హైదరాబాదీ అంబటి తిరుపతి రాయుడితో పాటు మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా, మహారాష్ట్ర మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్, మధ్యప్రదేశ్ పేసర్ ఈశ్వర్ పాండే, పంజాబ్ సీమర్ సిద్ధార్థ్ కౌల్‌లకు స్థానం దక్కింది. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే ఈ టోర్నీ కోసం మరో నెల రోజుల తర్వాత 15 మందితో తుది జాబితాను తయారు చేస్తారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లతో పాటు గాయాల కాలంగా కనుమరుగైన ఉమేశ్ యాదవ్, ప్రవీణ్ కుమార్ మళ్లీ వచ్చారు. టెస్టుల్లో ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్న పుజారాతో పాటు హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకూ నిరాశే మిగిలింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more