చావు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియాదు. అప్పటికి అందరితో హ్యాపీగా ఉన్న వ్యక్తి సడన్ గా ఇద్దరు వ్యక్తులతో గొడవపడటంతో.. ఇప్పుడు అతను మరణంతో పోరాటం చేస్తున్నారు. నిత్యం వివాదాలతో సహవాసం చేసే న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ మరోసారి గొడవలకు పోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ బార్ ఎదుట జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ రైడర్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. తలకు తీవ్ర గాయమవడంతోపాటు ఊపిరితిత్తులు కూడా బాగా దెబ్బతిన్నాయి. శరీరంలో అంతర్గత గాయాలు ఎక్కువగా ఉండడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న రైడర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలో అతనితోనే ఉన్నారు. జట్టు సభ్యులతోపాటు కొంతమంది మిత్రులతో కలిసి రైడర్ క్రైస్ట్‌చర్చ్‌లోని ఎక్‌మన్స్ బార్‌కు చేరుకున్నాడు. అయితే బార్ బయట ఫుట్‌పాత్‌పై ఇద్దరు వ్యక్తులతో జెస్సీ గొడవపడ్డా డు. ఆ తర్వాత ఎదురుగాఉన్న మెక్‌డొనాల్డ్స్‌లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గొడవపడిన వ్యక్తులు వచ్చి రైడర్‌పై దాడి చేశారు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. రైడర్‌కు శరీరంలో కనిపించని దెబ్బలు తగిలాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. దాడికి పాల్పడింది ఎవరనేది తెలియరాలేదని, అయితే ఎక్‌మన్ బార్, మెక్‌డొనాల్డ్స్‌లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి జరగనున్న ఐపీఎల్ ఆరో అంచె పోటీల్లో లెఫ్టాండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ రైడర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మెగా టోర్నీ కోసం శుక్రవారం అతడు భారత్‌కు బయల్దేరి రావాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more