భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ చరిత్ర సృష్టించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్డేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో కూడా ధోని సేన విజయదుంధుభి మోగించింది. మొదటి రోజు ఆట రద్దయి ఫలితం రాదనుకున్న టెస్టులో కూడా భారత ఆటగాళ్ళు సమిష్టిగా రాణించడంతో వరుసగా మూడో విజయం దక్కింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి ఆసీస్ ను భువనేశ్వర్ కుమార్ దెబ్బతీయడంతో 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, ఐదో రోజు ఆట ప్రారంభించి 233 స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 133 విజయ లక్ష్యాన్ని ఉంచింది. సీరిస్‌ల్లో ఇప్పటికే ఇండియా 2-0 అధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో హగ్స్(69) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జడేజా మూడేసి వికెట్లు తీశారు. ఓజా, అశ్విన్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
స్వల్ప విజయ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన భారత్ ఆసీస్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 133 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి చేరుకుంది. 33.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 136 పరుగులు సాధించింది. మరో 15 బంతులు మిగులుండగానే టీమిండియా మ్యాచ్ ముగించింది. ధోని వరుసగా మూడు ఫోర్లు బాది విజయాన్ని ఖాయం చేశాడు. మురళీ విజయ్ 26, పూజారా 28, కోహ్లి 34, సచిన్ 21, ధోని 18, జడేజా 8 పరుగులు చేశారు. తొలిసారి టెస్టులో అరంగ్రేటం చేసి, 187 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది, ఈ విజయంతో నాలుగు టెస్టుల ఈ సిరీస్ ను 3-0తో భారత్ గెల్చుకుంది. నాలుగో టెస్ట్ ఈనెల 22 నుంచి ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఆ టెస్టులో కూడా భారత్ విజయం సాధిస్తే ఆసీస్ వైట్ వాష్ అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more