భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ముంబై నగరంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించాలని యోచిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సోమవారం అతను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులను కలిశాడు. అకాడమీకి సంబంధించి కమిషనర్ సీతారామ్ కుంతేకు అతను ప్రతిపాదనలు ఇచ్చినట్లు సమాచారం. ‘క్రికెట్ శిక్షణకు అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తగిన స్థలంగా భావిస్తున్నాను.బీఎంసీ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా, బయటివారికి నామమాత్రపు ఫీజుతో ఇక్కడ కోచింగ్ ఇస్తాం’ అని భజ్జీ వెల్లడించాడు. అయితే హర్భజన్ కేవలం ఈ విషయాన్ని అనధికారికంగా చర్చించాడని... అకాడమీలో ఎవరికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడో తదితర వివరాలు స్పష్టంగా తెలియజేస్తూ పూర్తి స్థాయి ప్రతిపాదనలు ఇచ్చిన తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని మరో అధికారి స్పష్టం చేశారు. పంజాబ్ స్వస్థలం అయినా గత ఐదేళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడిగా భజ్జీకి నగరంతో అనుబంధం కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more