ముంబయి రంజీ జట్టు మరోసారి తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంది. సౌరాష్ట్రతో జరిగిన రంజీట్రోఫీ ఫైనల్లో ఘన విజయం సాధించి, 40వ సారి టైటిల్ గెలుచుకున్న జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాఖండే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబయి ఇన్నింగ్స్ 125 పరుగల తేడాతో సౌరాష్ట్ర పై గెలిచింది. రెండు సీజన్ల అనంతరం ముంబై చాంపియన్‌గా నిలిచింది. చివరిసారిగా 2009-10లో కర్ణాటకను ఓడించింది. విజేతగా నిలిచిన ముంబై జట్టుకు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీ లభించగా, రన్నరప్ సౌరాష్ట్రకు రూ.కోటి దక్కింది. దీంతో ముంబై ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుతో తలపడే అర్హత సాధించింది. పేసర్లు అగార్కర్ (4/15), ధావల్ కులకర్ణి (5/32) బౌలింగ్ ధాటికి సౌరాష్ర్ట తమ రెండో ఇన్నింగ్స్‌లో పేక మేడలా కూలి మూడో రోజే మ్యాచ్‌ను అప్పగించింది.
వీరి జోరుకు కేవలం 36.3 ఓవర్లలో 82 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్ ధరేంద్ర జడేజా (22), శాండిల్య (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అంతకుముందు ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 119 ఓవర్లలో 355 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 207 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. హికేన్ షా (55), అంకిత్ చవాన్ (41) రాణించారు. మక్వానాకు మూడు, త్రివేది, శాండిల్య, ధర్మేంద్ర జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌరాష్ట్రను ముంబై పేసర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్ బంతులతో వణికించారు. క్రీజులో కుదురుకోవడానికి కూడా సమయమివ్వకుండా తొలి ఓవర్ నుంచే వికెట్ల పతనాన్ని ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more