ఈ మధ్య పరాజయాల పాలై విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియా జట్టు ఇంగ్లాండ్ తో కోచిలో జరిగిన రెండవ వన్డేలో భారత జట్టు భారీ స్కోరు తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన భారత ఆటగాళ్లు నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేశారు. ధోని 72, జడేజా 61, రైనా 55, కోహ్లీ 37, యువరాజ్ 32 పరుగులతో రాణించారు. ముఖ్యంగా ధోని, జడేజాలు 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు మంచి స్కోరును అందించారు. ఇక 286 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను భారత బౌలర్లు షమీ, భువనేశ్వర్ కుమార్. జడేజా, అశ్విన్ లు కట్టడి చేశారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడికి లోనై వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టు 36 ఓవర్లలోనే 158 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్ కు 127 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. మొదట్లోనే బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు. భువనేశ్వర్, అశ్విన్ లు మూడేసి, జడేజాకు రెండు వికెట్లు, షమీకి ఒక వికెట్ లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్, డెర్న్ బాచ్ రెండేసి వికెట్లు, వోక్స్, ట్రెడ్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు. చాలా రోజుల తరువాత భారత జట్టు సమష్టిగా రాణించి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా, 1-1 తో సమం చేసింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more