రాజకీయాలు దేశం పరువు తీస్తాయని మనం ఊహించి ఉండం. అధికారం కోసం, పదవుల కోసం ఏమైనా చేయడానికి వెనకాడరు రాజకీయ నాయకులు. అలాంటి నాయకుల వల్ల ఇప్పుడు భారత్ పరువు మంట గలిసింది. క్రీడా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఒలంపిక్స్ లో భారత్ పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. భారత్ పై వేటు వేయాల్సినంతగా చేసిన తప్పేంటి అంటే.... భారత ప్రభుత్వం రూపొందించిన ‘స్పోర్ట్స్ కోడ్ ’ ప్రకారం ఎన్నికలు నిర్వహించొద్దని, ఒలింపిక్ చార్టర్ ప్రకారమే జరపాలని ఐఓసీ చాలాసార్లు హెచ్చరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిపితే వాటి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని కూడా పలుమార్లు లేఖల ద్వారా తెలిపింది. అయినప్పటికీ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోని ఐఓఏ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తాము కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదే రీతిలో స్పోర్ట్స్ కోడ్ ప్రకారం బుధవారం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. దీంతో ఆగ్రహించిన ఐఓసీ సస్పెన్షన్ వేటు వేసింది. భారత క్రీడా రంగానికి పెనుదెబ్బ అనే చెప్పవచ్చు. ఇలా పదవుల కోసం, కాసుల కోసం కక్కుర్తి పడి ప్రభుత్వాలు నడిపే రాజకీయ నాయకులు భారత పరువు పోగొట్టవద్దని పలువురు క్రీడా కారులు కోరుతున్నారు. మరి ఇప్పుడు జరిగిన అవమానంతోనైనా ఇక పై సక్రమంగా నడుచుకుంటారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more