మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై మళ్ళీ విమర్శలు గుప్పించే వారు ఎక్కువయ్యారు. దీనికి కారణం ప్రస్తుతం అతను ప్రదర్శిస్తున్న ఆటతీరు. సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడతాడని అందరు భావించారు. కానీ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో ఏ మాత్రం రాణించలేక పోయాడు. ఇక ఈ ఏడాది మొత్తంగా అతని ప్రదర్శన కూడా పేవలంగా ఉంది. ఈ యేడాది ఇప్పటి వరకు మొత్తం 153 పరుగులు మాత్రమే చేశాడు. ఈ యేడాదితో అత్యధిక వ్యక్తిగత స్కోరు 80 పరుగులు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ పరుగులు సాధించాడు. ఆ తర్వాత గత పది టెస్ట్ ఇన్నింగ్స్‌లలో అతని బ్యాటింగ్ సగటు 15.3 శాతం. అలాగే, టెస్టుల్లో సచిన్ చివరి సారి దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ 2011 జనవరి నెలలో జరిగింది. ఈ నేపథ్యంలో.. సచిన్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. మరి వీటన్నించికి బ్యాట్ తో సమాధానం చెబుతాడో లేక నోటితో సమాధానం చెబుతాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more