వరుస వైఫల్యాలతో సతమతమౌతున్న ధోనీ బృందం తాజాగా శ్రీలంకలో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో కూడా సెమీస్ లో అడుగుపెట్టలేక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో వున్న బిసిసిఐ ఇక ప్రక్షాళన తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా మూడోసారి కూడా టి-20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరకపోవడం ఘోరమైన విషయమని, ఇక ఉపేక్షించలేమని భావిస్తున్న బిసిసిఐ పెద్దలు మూడు ఫార్మేట్లకు ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. విదేశాల్లో వరుసగా 8 టెస్టులను కోల్పోయిన కెప్టెన్‌గా ధోనీ అప్రదిష్ట మూట గట్టుకున్నా టెస్టులకు అతన్నే సారధిగా కొనసాగించాలని, ఇక ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న 'రైజింగ్ స్టార్' విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా నియమించాలని, ఇక 'పొట్టి' క్రికెట్‌కు ఆల్‌రౌండర్ లక్షణాలున్న సురేష్ రైనాను సారధిగా ఎంపిక చేయాలని బిసిసిఐ యోచిస్తునట్లు అది వెల్లడించింది.
ధోనీ కెప్టెన్సీపై అంతకంతకూ విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక ఉపేక్షించడం మంచిదికాదని, వచ్చే టోర్నమెంటుకు ముందుగానే ఈ మార్పులను చేపట్టాలని భావిస్తున్నట్లు అది పేర్కొంది. 'ధోనీని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వాస్తవానికి అతనిది 'జూదరి ' మనస్తత్వమని, 'టైమ్' బాగున్నంతకాలం అది కలిసి వచ్చిందని, ఇప్పుడు ఎదురుదెబ్బలు తగలడం మొదలైందని' భారత మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ వ్యాఖ్యానిస్తూ, విదేశాల్లో వరుసగా 8 టెస్టుల్లో పరాజయం ఎదుర్కోవడంతోపాటు ఆసియాకప్, ప్రస్తుత టి-20 వరల్డ్ కప్‌లో వైఫల్యాలకు ధోనీదే ప్రధాన బాధ్యతని, గతంలోనే తగిన మార్పులు చేపట్టివుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అన్నాడు. అలాగే పలువురు వ్యాఖ్యాతలు, విమర్శకుల నుండి ధోనీకి వ్యతిరేకమైన వ్యక్తం కావడంతో తగిన నిర్ణయాలు తీసుకోక తప్పని స్థితిలో బిసిసిఐ పడిందని తెలుస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more