'మైటీ' వెస్టిండీస్ 33 ఏళ్ళ అనంతరం మరోసారి 'జూలు' విదిలించింది.తొలి రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో (1975, 79) వరుసగా విజేతగా నిలిచి తిరుగులేని జట్టుగా వెలుగొందిన విండీస్ 83లో కపిల్ డెవిల్స్ చేతిలో కంగుతిన్న అనంతరం, మరోసారి వరల్డ్ కప్ అందుకోలేక పోవడమేగాక అంతకంతకు ప్రమాణాలు కోల్పోతూ అట్టడుగుకు చేరుకుంది. అటువంటి వెస్టిండీస్ బృందం సంచలన రీతిలో ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రతిభ ప్రదర్శిస్తూ 'ఫేవరెట్'లను మట్టిగరిపిస్తూ, మరోసారి వరల్డ్ కప్ అందుకుని తమ దేశంలో క్రికెట్‌కు మరింతగా ఆదరణ పెరిగేందుకు దోహదం చేసింది.
కాగా, కీలకమైన సెమీస్‌లో పాక్‌ను చిత్తుచేసి ఇక టైటిల్ ఖాయమని అభిమానులు ఆశలు పెంచుకున్న తరుణంలో జయవర్ధనే బృందం వరుసగా మూడోసారి ఫైనల్స్ లో ఓడిపోయి భంగపాటును ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ అజంతా మెండిస్ (4/12) 'స్పిన్ మాయాజాలం'తో ఆరంభంలోనే 'డాషింగ్ ఓపెనర్' గేల్ (3)ను కోల్పోవడంతోపాటు కీలకమైన ద్వానే బ్రావో (19), పొల్లార్డ్ (2), రస్సెల్ (0) వికెట్లను తీయడంతో మూడంకెల స్కోరు చేయడం కూడా కష్టమేననిపించింది. అయితే 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్' మార్లోన్ శామ్యూల్స్ (78, 56 బంతుల్లో 3×4, 6×6)లతో విజృంభిం చడంతో పాటు కెప్టెన్ డిరెన్ సామ్మి (26, 15 బంతుల్లో 3×4) జోడీగా చివర్లో వేగంగా పరుగులు జోడించడంతో 6 వికెట్లకు 137 పరుగులకు చేరుకుంది.
అనంతరం ఒక మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఓవర్లోనే దిల్షాన్ (0) వికెట్‌ను కోల్పోయినా, కెప్టెన్ జయవర్ధనే (33, 36 బంతుల్లో 2×4), సంగక్కర (22, 26 బంతుల్లో 2×4) నిలకడగా ఆడుతూ 42 రన్స్ జోడించి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించేలా కనిపించారు. అయితే పదో ఓవర్లో శామ్యూల్ బద్రీ బౌలింగ్‌లో పొల్లార్డ్ పట్టిన అద్భుత క్యాచ్‌కి సంగక్కర అవుట్ కావడంతో మ్యాచ్ మలుపుతిరిగింది. తరువాతి ఓవర్లో సామ్మి బౌలింగ్‌లో మాథ్యూస్ (1) వెనుదిరగగా, జయవర్ధనే కూడా 'మిస్టరీ' స్పిన్నర్ సునీల్ నారైన్ బౌలింగ్‌లో సామ్మికి క్యాచ్ యిచ్చి అవుట్ కావడంతో లంక చిక్కుల్లో పడింది. ఆ దశలో జీవన్ మెండిస్ (3), పెరీరా (3) కూడా రనౌట్ కావడంతో ఓటమి ఖాయమైంది. చివర్లో కులశేఖర (26, 13 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు మెరిపించినప్పటికీ ఫలితం లేకపోయింది.
స్కోరు బోర్డు : వెస్టిండీస్ : ఛార్లెస్ (సి) కులశేఖర (బి) మాథ్యూస్ 0, గేల్ ఎల్‌బిడబ్ల్యు (బి) అజంతా మెండిస్ 3, శామ్యూల్స్ (సి) జీవన్ మెండిస్ (బి) ధనంజయ 78, ద్వానే బ్రావో ఎల్‌బిడబ్ల్యు (బి) అజంతా మెండిస్ 19, పొల్లార్డ్ (సి) ధనంజయ (బి) అజంతా మెండిస్ 2, రస్సెల్ ఎల్‌బిడబ్ల్యు (బి) అజంతా మెండిస్ 0, సామ్మి నాటౌట్ 26, రామ్‌ధిన్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137.
వికెట్ల పతనం : 1-0, 2-14, 3-73, 4-87, 5-87, 6-108.
బౌలింగ్: మాథ్యూస్ 4-1-11-1, కులశేఖర 3-0-22-0, మలింగ 4-0-54-0, అజంతా మెండిస్ 4-0-12-4, ధనంజయ 3-0-16-1, జీవన్ మెండిస్ 2-0-20-0.
శ్రీలంక: జయవర్ధనే (సి) సామ్మి (బి) సునీల్ నారైన్ 33, దిల్షాన్ (బి) రవి రాంపాల్ 0, సంగక్కర (సి) పొల్లార్డ్ (బి) శామ్యూల్ బద్రీ 22, మాథ్యూస్ (బి) సామ్మి 1, జీవన్ మెండిస్ రనౌట్ 3, పెరీరా రనౌట్ 3, తిరిమన్నె (సి) ఛార్లెస్ (బి) సామ్మి 4, కులశేఖర (సి) బద్రీ (బి) సునీల్ నారైన్ 26, మలింగ (సి) ద్వానే బ్రావో (బి) సునీల్ నారైన్ 5, అజంతా మెండిస్ (సి) బ్రావో (బి) శామ్యూల్స్ 1, ధనంజయ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 101.
వికెట్ల పతనం : 1-6, 2-48, 3-51, 4-60, 5-61, 6-64, 7-69, 8-96, 9-100, 10-101.
బౌలింగ్ : శామ్యూల్ బద్రీ 4-0-24-1, రవి రాంపాల్ 3-0-31-1, శామ్యూల్స్ 4-0-15-1, గేల్ 2-0-14-0, సునీల్ నారైన్ 3.4-0-9-3, సామ్మి 2-0-6-2.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more