ప్రపంచకప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘనమైన రికార్డు కొనసాగుతూనే ఉంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన తరుణంలో, భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా అదరగొట్టింది. సూపర్-8 దశలో గ్రూప్-2లో పాక్‌తో ఆదివారమిక్కడ 'హై ఓల్టేజ్' మ్యాచ్‌లో ధోనీ సేన ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో భారత్ ఆధిపత్యాన్ని తగ్గించాలని ఉబలాటపడ్డ దాయాదికి నిరాశే మిగిలింది. పాక్ నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో మూడు ఓవర్లు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
యువ సంచలనం విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 నాటౌట్) మరోసారి మ్యాచ్ విన్నర్ అవతారమెత్తగా.. సెహ్వాగ్ (29), యువరాజ్ (19 నాటౌట్) తమ వంతు సహకారమందించారు. పాక్ బౌలర్లలో అఫ్రీది, రజా హసన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హఫీజ్ సేన.. 19.4 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. షోయబ్ మాలిక్ (28), ఉమర్ అక్మల్ (21) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో బాలాజీ (3/22), అశ్విన్ (2/16), యువరాజ్ (2/16) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బౌలింగ్‌లో కీలక హఫీజ్ (15) వికెట్ పడగొట్టడమే కాకుండా సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్నందించిన కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more