19ఏళ్ల కుర్రాడంటే ఎలా ఉంటాడు...సరదాగా ఆడుతూ పాడుతూ, కొత్త ఫ్యాషన్‌లను అనుకరిస్తూనే అప్పుడప్పుడు కాస్త లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తూ ఒక రకమైన స్టైల్‌లో కనిపిస్తాడు. కానీ భారత జట్టును ప్రపంచకప్ విజేతగా నిలబెట్టిన ఉన్ముక్త్ చంద్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఎంత మంచి ఆటగాడైనా ప్రవర్తనలో ఎక్కడా అనవసరపు దూకుడు ప్రదర్శించకుండా ప్రశాంతంగా కనిపిస్తాడు. ఈ వయసులో అతని ప్రియ నేస్తాలు ఏమిటో తెలుసా... చక్కటి పుస్తకాలు! చంద్‌కు పుస్తక పఠనం అంటే ఎంతో ప్రీతి. దానికి తోడు రెగ్యులర్‌గా డైరీ రాసే అలవాటు కూడా ఉంది. ‘నాతో పాటు ఎప్పుడూ డైరీ, డిక్షనరీ ఉంటాయి. కొత్త పదం ఏదైనా కనిపిస్తే వెంటనే రాసుకుంటాను. దానిని డిక్షనరీలో వెతికి ఆ తర్వాత మాట్లాడేటప్పుడు ఉపయోగించే ప్రయత్నం చేస్తాను’ అని ఈ ఢిల్లీ కుర్రాడు అంటాడు.
నిజంగానే అతను ఇప్పుడు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతుంటే చాలా మంది వాటి అర్ధాల కోసం తడుముకోవాల్సి వస్తోంది. తన ఆటను స్వయంగా విశ్లేషించుకుంటూ డైరీల్లో రాసుకునే చంద్, ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించాలని భావిస్తున్నాడు. స్కూల్‌లో ఉండగా బ్రెట్‌లీని ఎదుర్కొనే అవకాశం రావడం, అండర్-16 మ్యాచ్‌లో రనౌట్ కాకుండా ఎలా ఉండాల్సిందో ఇవన్నీ అతని డైరీలో కనిపిస్తాయి. పాఠశాల స్థాయిలో జాతీయ స్థాయి స్విమ్మర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఉన్ముక్త్ ప్రపంచకప్‌కు ముందు మూడు టోర్నీల్లో భారత్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో రెండింటిలో మన టీమ్ టైటిల్ నెగ్గింది. ఇక ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ వంతు. ఇంటర్ పాస్ అయిన రెండు రోజులకు అతనికి ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది.ఉన్ముక్త్ తండ్రి భరత్ చంద్ ఠాకూర్ ఢిల్లీలోని ఆర్‌పీవీ విద్యాలయాలో ఎకనామిక్స్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఉన్ముక్త్ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్. చంద్‌ను క్రికెటర్‌గా తీర్చి దిద్దడంలో అతని బాబాయ్ సుందర్ పాత్ర ఎంతో ఉంది. చంద్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. గత మే నెలలో హాజరు శాతం తక్కువగా ఉందని కళాశాల పరీక్షలకు అనుమతించకపోవడంతో చంద్ కోర్టుకెక్కాడు. క్రీడాకారుల కోటాలో అడ్మిషన్ పొందిన ఉన్ముక్త్‌కు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించాల్సి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more