నరాలు తెగే ఉత్కంఠ పోరును కోరుకునే క్రికెట్ ప్రేమికులకు శుభవార్త! ప్రత్యేకించి భారత్-పాకిస్తాన్ అభిమానులకైతే సంబరాలు చేసుకునే విషయం! ఐదేళ్లుగా భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం నిరీక్షించిన అభిమానుల కోరిక త్వరలో నెరవేరనుంది. దాయాదుల సమరానికి మళ్లీ తెరలేవనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య సిరీస్‌కు బీసీసీఐ ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. డిసెంబర్‌లో భారత్ వేదికగా పాక్‌తో వన్డే, టి-20 సిరీస్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ వర్కింగ్ క మిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొంతకాలంగా ఇండో-పాక్ సిరీస్‌పై నెలకొన్న సందిగ్దానికి తెరపడినట్టయింది!భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు పునఃప్రారంభం కానున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌కు అంగీకరించాలంటూ ఎన్నాళ్లుగానో బతిమాలుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై భారత క్రికెట్ బోర్డు (బీబీసీఐ) ఎట్టకేలకు కరుణించింది. 2012 డిసెంబర్- 2013 జనవరిలో మూడు వన్డేలతోపాటు రెండు టి-20 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ వర్కింగ్ కమిటీ సోమవారం నిర్ణయించింది. దీనికి భారత ప్రభుత్వ ఆమోదం పొందడమే తరువాయి. 'పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. అందుకోసం డిసెంబర్‌లో పాక్‌ను మన దేశానికి ఆహ్వానించనున్నాం. పాక్ జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు భార త ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉంది. దీనిపై హోంమంత్రి చిదంబరంతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడాం.
పాక్‌తో సిరీస్‌కు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంద'ని బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా తెలిపారు. వన్డేలకు చెన్నయ్, కోల్‌కతా, ఢిల్లీ ఆతిథ్యమివ్వనుండగా.. బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లో టి-20 నిర్వహించనున్నట్టు తెలిసింది. అయితే భారత్‌లో పాక్ పర్యటిస్తే భద్రత విషయమే ఇంకా ఎటూ తేలలేదు! కాగా, ఈ సిరీస్ విషయమై తమకెలాంటి అధికారిక సమాచారమూ అందలేదని పీసీబీ చైర్మన్ జాక్ అష్రాఫ్ తెలిపాడు. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై అష్రాఫ్ ఆనందం వ్యక్తం చేశాడు. 2007లో చివరిసారిగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగ్గా భారత్ 3-2తో విజయం సాధించింది. 2008 ముంబయి దాడుల కారణంగా పాక్‌తో క్రికెట్‌కు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కా గా, అంతర్జాతీయ ఈవెంట్లయిన వన్డే ప్రపంచకప్, ఆసియా కప్‌ల్లో భా రత్, పాక్‌లు తలపడ్డాయి. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడి తర్వాత అంతర్జాతీయ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించలేదు.
సెక్యూరిటీతో సమస్యే..: దాయాదులు ఎక్కడ తలపడ్డా స్టేడియాలు నిండిపోవడం ఖాయం. పైగా భారత్‌లో మ్యాచ్‌లంటే వేరే చెప్పక్కర్లేదు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ కాబట్టి ఈ సారి అభిమానులు పో టెత్తే అవకాశముంది. కాబట్టి వారిని అదుపు చేయడం కష్టమే! పైగా పాక్‌జట్టుకు భద్రత కల్పించడం కూడా పోలీసులకు తలనొప్పిగా మారనుంది. పాక్‌లో హర్షం: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇప్పుడు నూతనోత్తేజం వచ్చినట్టయింది. స్వదేశంలో సిరీస్‌లు లేక.. విదేశాల్లో జనాదరణ లేక నీరసించి పోయిన పాక్ క్రికెట్‌కు బీసీసీఐ నిర్ణయం ఊపుతెచ్చిందని పాక్ మాజీలు హర్షం వ్యక్తం చేశారు. 'ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భారత్, పాక్ సిరీస్ అంటే ప్రపంచ వ్యా ప్తంగా ఆసక్తి నెలకొంటుంద'ని పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ అన్నా డు. మరో మాజీ ఆటగాడు జావెద్ మియాందాద్ మాట్లాడుతూ.. 'భారత్ తో సిరీస్ కోసం పీసీబీ చైర్మన్ దీనికోసం చాలా శ్రమించాడు. ఏదేమైనా భా రత్ అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంద'ని అన్నాడు.ఐపీఎల్-6 వేలానికి పాక్ ఆటగాళ్లు!: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ కార్యరూపం దాల్చడంతో పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ల భించే అవకాశముంది. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సిఉంది. బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఐపీఎల్-6 వేలంలో పాక్ ఆటగాళ్లు పాల్గొనవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more