అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ వైదొలిగారు. న్యూజిలాండ్‌కు చెందిన అలెన్ ఇసాక్ ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌గా, నిన్నటిదాకా ఐసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన 60 ఏళ్ల ఇసాక్ ఐసీసీకి 8వ అధ్యక్షుడు. ఇక ఐసీసీకి కొత్త సీఈఓ కూడా వచ్చారు. దక్షిణావూఫికా మాజీ వికెట్ కీపర్ డేవ్ రిచర్డ్సన్ తమ దేశానికే చెందిన హరూన్ లోర్గాత్ నుంచి ఈ బాధ్యతల్ని స్వీకరించారు. కాగా ఉపాధ్యక్షపదవిలో కొనసాగుతున్న వ్యక్తి అధ్యక్షునిగా ఎంపికవుతూ వస్తున్న సంప్రదాయం ఇసాక్ తో ముగియనుంది. 2014లో ఇసాక్ పదవీ విరమణ చేశాక అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ను ఐసీసీ పూర్తి ప్రక్షాళన చేయనుంది. కాగా ఐసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఇసాక్ అన్నారు. ‘గత రె ండేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం.. ఇకముందూ ఉంటాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ను ఇప్పుడున్నట్లుగా ఆరోగ్య స్థితిలో నడపడం సవాలేకానుంది. మూడు ఫార్మాట్లనూ వేటికవే ప్రాధాన్యత కలిగేవిధంగా చూడడమూ ముఖ్యమే’ అని ఇసాక్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more