ప్రపంచ ప్రఖ్యాత బ్యాటింగ్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్‌లలో ఎవరు గొప్ప?.. అభిమానుల నుంచి క్రీడా పండితుల వరకు తరచూ వినిపించే ప్రశ్న! కొందరు బ్రాడ్‌మన్ గొప్పంటే.. మరికొందరు మాస్టరే అంటుంటారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఆర్థిక రంగ పరిశోధకుడు.. బ్రాడ్‌మన్ కంటే సచినే గొప్ప టెస్టు బ్యాట్స్‌మన్ అని తేల్చేశాడు.గ్రిఫిత్ యూనివర్సిటీ రీసెర్చర్ నికోలస్ రోడ్ అర్థిక సిద్ధాంతాన్ని అన్వయించి వేర్వేరు తరాలకు చెందిన ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఆటతీరును బేరీజు వేశాడు. వీరిద్దరి కెరీర్‌లోని గణాంకాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంక్‌లను కేటాయించినట్టు నికోలస్ చెప్పాడు. దీని ప్రకారం బ్రాడ్‌మన్ కంటే సచిన్ గొప్ప ఆటగాడని నికోలస్ చెబుతున్నాడు. ఇక నికోలస్ రూపొందించిన టాప్-10 జాబితాలో రాహుల్ ద్రావిడ్‌కు నాలుగు, గవాస్కర్‌కు ఎనిమిది ర్యాంక్‌లు దక్కాయి.సచిన్ కాదు ఇంజమామ్: బ్రాడ్‌మన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. సచిన్ ఆటతీరు తన బ్యాటింగ్‌కు శైలికి దగ్గరగా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టోనీ షిల్లింగ్లా ఈ వాదనతో విభేదిస్తున్నాడు. ఓ విశ్లేషణ ప్రకారం వీరిద్దరి ఆటతీరు విభిన్నంగా ఉంటుందని చెప్పాడు. బయోమెకానికల్ పద్ధతి ప్రకారం ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్తాన్) ఆటతీరు బ్రాడ్‌మన్ శైలికి దగ్గరగా ఉంటుందని షిల్లింగ్లా పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more