శ్రద్ధా కపూర్ హాట్ ఫోటోషూట్ ఫర్ జీక్యూ ఇండియా ఎడిషన్
‘‘తీన్ పత్తి’’ సినిమాతో శ్రద్ధాకపూర్ బాలీవుడ్ తెరకు పరిచయమైనప్పటికీ... ఆ సినిమాతో ఆమెకు ఎటువంటి గుర్తింపు దక్కలేదు. అమితాబ్ లాంటి లెజెండ్ హీరోలు ఆ సినిమాలో వున్నా ప్రయోజనం లేకపోయింది. అయితే ఆ తరువాత వచ్చిన ‘‘లవ్ కా ది ఎండ్’’ సినిమాతో బాలీవుడ్ లో ఓ మోస్తరు వరకు తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ సినిమా అంత పెద్ద హిట్ కాకపోయినా... ఈమెకు మాత్రం అవార్డుల వర్షం కురిపించింది.