విచ్చుకున్న పెదవులపై అలవోకగా కదలాడే చిరునవ్వుతో చూడగానే ఆకట్టుకునే అందాలనటి... ప్రియ. ‘ప్రియసఖిగా’ తెలుగువారి మనసుల్లో ప్రతేకస్థానం సంపాదించుకున్న ఆమె... ప్రస్తుతం కన్నవారి కలలు, సుడిగుండాలు, చిన్న కోడలు తదితర సీరియల్స్‌తో ప్రతిరోజూ పలకరిస్తున్నారు. ఇన్నేళ్ల తన నట ప్రయాణం గురించి ప్రియ చెప్పిన కబుర్లు...
చిన్ననాటి స్మృతులు?
మేం తెలుగువారమే కానీ నేను పుట్టింది మాత్రం రాజస్థాన్‌లో (మే 20). అప్పటికి నాన్న అక్కడ ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన రిటైరయ్యాక హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. అప్పుడు నాకు ఐదేళ్లు.
నటిగా తొలి అడుగు...?
జెమిని టీవీ మొట్టమొదటి మెగా సీరియల్ ‘ప్రియసఖి’ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టాను. అది పెద్ద హిట్. అందు లోని నా పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత సంఘర్షణ, లేడీ డిటెక్టివ్, జ్వాల... ఇలా చేసుకుంటూ పోయాను. సినిమా చాన్సులు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. మాస్టర్, గోకులంలో సీత, రాజకుమారుడు... ఇలా ఇప్పటివరకూ దాదాపు డెబ్భై సినిమాల వరకూ చేశాను.
సడెన్‌గా కనిపించకుండా పోయారేం?
2001లో పెళ్లి చేసుకున్నాను. సగంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాను తప్ప కొత్తవి ఒప్పుకోలేదు. తర్వాత బాబు పుట్టడంతో ఇక వాడే ప్రపంచమైపోయాడు. అందుకే అంత గ్యాప్!
సెకండ్ ఇన్నింగ్స్ ఎలా మొదలైంది?
జెమిని టీవీలో ‘నువ్వు-నేను’ ప్రోగ్రామ్‌కి పిలిస్తే వెళ్లాను. అందులో నన్ను చూసిన బాలాజీ టెలిఫిల్మ్స్‌వారు ‘కొత్త బంగారం’ కోసం అడిగారు. మంచి పాత్ర కావడంతో మళ్లీ మేకప్ వేసుకున్నా.
కానీ ఈసారి స్టైల్ మార్చినట్టున్నారే?
అవును. (నవ్వుతూ) బాలాజీ వారికి నాలో ఏం కనిపించిందో కానీ, నెగిటివ్ రోల్ ఆఫర్ చేశారు. అప్పటివరకూ సాఫ్ట్ రోల్స్ మాత్రమే చేసిన నేను కాస్త కంగారుపడ్డాను. కానీ మంచి పాత్ర కదా అని ఒప్పుకున్నాను.
కెరీర్‌లో బెస్ట్ అని ఫీలయ్యే పాత్రలు?
‘ప్రియసఖి’, ‘కొత్త బంగారం’లో చేసినవి. మొదటిది నాకు నటిగా ఓ గుర్తింపునిస్తే, రెండోది చాలా గ్యాప్ తర్వాత నన్ను మళ్లీ అందరికీ గుర్తు చేసింది. ఓ సరికొత్త ఇమేజ్‌ని ఇచ్చింది.
ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్?
‘పెళ్లిసంబంధం’ సినిమాలో ఏఎన్నార్ మనవరాలిగా చేశాను. షాట్ గ్యాప్‌లో అందరం కూర్చునివున్నాం. ఎవరో జోక్ చేస్తే నేను గట్టిగా నవ్వాను. వెంటనే రాఘవేంద్రవుగారు- ‘నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టుల్లో ప్రియ ఒకతె’ అన్నారు. ఆయనలా అనడంతో ఆశ్చర్యపోయాను. నా జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అది!
బాధ కలిగిన సందర్భం?
కచ్చితంగా బాధ అని కాదు గానీ, ఇబ్బంది పడిన సందర్భం ఒకటుంది. ‘నువ్వు-నేను’ షోకి ఎవరైనా జంటగానే వెళ్లాలి. కానీ మావారు దేనికీ రారు. దాంతో ‘పెళ్లి చేసు కుందాం’ సీరియల్లో నాతో నటించిన కమల్‌తో వెళ్లాను. చూసినవాళ్లంతా అతనే నా భర్త అనుకున్నారు. ఎక్కడ కనిపించినా ఎవరో ఒకరు అడుగుతూ ఉండేవారు. ఎంత ఇబ్బందిగా ఉండేదో!నటిగా ప్రియ తెలుసు.
వ్యక్తిగా ప్రియ గురించి..?
నేను ఎవరితోనూ అంతగా మాట్లాడను. నా పనేంటో నేను తప్ప చుట్టూ ఏం జరుగు తుందో కూడా పట్టించుకోను. ఇంట్లో కూడా అంతే. చాలా మెతక మనిషిని. అందుకే నేను చేస్తున్న పాత్రలు చూసి మావాళ్లు అంటున్నారు- ‘అసలు నువ్వేంటి, నెగిటివ్ రోల్స్ చేయడమేంటి’ అని!
నటిగా మీ రోల్‌మోడల్..?
సౌందర్య. ఆవిడతో కలసి ఇరవై సినిమాలు చేసుంటాను. అప్పట్లో ప్రతి సినిమాలోనూ సౌందర్య సిస్టర్ అంటే ప్రియ, సౌందర్య ఫ్రెండ్ అంటే ప్రియ. చాలా సినిమాలకు ఆవిడ నన్ను రికమెండ్ చేసేవారు కూడా.
మీలో మీరు మార్చుకోవాలనుకునేది?
నేనెవరినీ అవకాశం ఇవ్వమని అడగను. ఎందుకో నాకూ అర్థం కాదు. ఎవరైనా నన్ను చూడాలనంటే, ఫొటోలు పంపిస్తాననో, ఫలానా చానల్లో నా సీరియల్ చూడండనో అంటాను. లేకపోతే మా ఇంటికి రమ్మంటాను. ఈ మధ్య ఒకాయన అన్నారు, నేను మీ ఇంటికొచ్చినా మీరు మా ఇంటి కొచ్చినా బాగోదు, ఇది ఆఫీసు పని కదా అని. నిజమే కదా అనిపించింది. ఆ పద్ధతి మార్చుకోవాలని అర్థమైంది.
నటన కాకుండా..?
ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటాను. ఉదయభానుకి నేనే డిజైన్ చేస్తాను.
భవిష్యత్ ప్రణాళికలు..?
సీరియల్స్‌తో పాటు ఢమరుకం, వారధి తదితర సినిమాలు కూడా చేస్తున్నాను. అయితే ‘వసంతకోకిల’లో శ్రీదేవి, ‘దామిని’లో మీనాక్షి శేషాద్రి చేసిన పాత్రల్లాంటివి చేయాలనుంది. దానికోసం నేనే ఓ సీరియల్ నిర్మాణం చేపట్టాలను కుంటున్నాను. ఆ ప్రయత్నాల్లో ఉన్నాను.మావారు కిశోర్ విండ్ ఎనర్జీ కంపెనీ (ఇండియా) యజమాని. మాకు ఒక బాబు, నిశ్చయ్. షూటింగ్ టైములో తప్ప మిగిలిన సమయమంతా నేను మా ఫ్యామిలీతోనే గడుపుతాను. మా బాబు చిన్ని చిన్ని బట్టలు ఇస్త్రీ చేస్తూ, వాడికి సంబంధించిన పనులు చేయడంలో ఉన్న ఆనందం నాకు మరెందులోనూ దొరకదు!
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more
Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more