Tv artists krishna kaushik interview

Telugu TV artists Krishna Kaushik is a well known face among the Telugu TV audiences. He has acted in various serials, on TV channels like Zee Telugu, ETV and Gemini TV and has gained much popularity

Telugu TV artists Krishna Kaushik is a well known face among the Telugu TV audiences. He has acted in various serials, on TV channels like Zee Telugu, ETV and Gemini TV and has gained much popularity

తెలుగు టీవీ ఆర్టిస్ట్ కృష్ణ కౌశిక్

Posted: 04/16/2012 01:48 PM IST
Tv artists krishna kaushik interview

Telugu_TV_artists_Krishna_Kaushik__interview

Krishna_Kaushikదూరదర్శన్‌లో ‘కిట్టిగాడు’గా కనిపించినప్పుడు పిల్లలంతా అతడికి ఫ్యాన్సైపోయారు. ‘ప్రియాంక’లో విలన్‌గా నటిస్తే వారేవా అన్నారు. తర్వాత వరుసగా పద్మవ్యూహం, పంజరం, అలౌకిక, దేవత తదితర సూపర్‌హిట్ సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీకృష్ణకౌశిక్. తన నట ప్రయాణం గురించి అతడు చెప్పిన ముచ్చట్లు...

మీ బ్యాగ్రౌండ్....

నేను మా అమ్మమ్మగారి ఊరు ఏలూరులో పుట్టాను (డిసెంబర్ 8). నాన్న మద్రాసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసేవారు. దాంతో ఇంటర్ అయ్యేవరకూ అక్కడే! నాన్న రిటైరయ్యాక మేం హైదరాబాద్ వచ్చేయడంతో ఉస్మానియాలో బీఎస్సీ కంప్యూటర్స్, తర్వాత ఎం.ఎ.ఇంగ్లిష్ చేశాను.

నటన పై ఆసక్తి ఎలా కలిగింది?

చిన్నప్పుడు చెన్నైలో మా పై అంతస్తులో మా ఫ్రెండ్ గురు వాళ్లు ఉండేవారు. వాళ్లు హిందూ పేపర్ తీసుకునేవారు. ఓసారి పొరపాటున వాళ్లకు రెండు పేపర్లు రావడంతో ఎక్స్‌ ట్రా పేపర్ నేను తీసుకున్నాను. అందులో కుట్టి పద్మిని ‘కిట్టిగాడు’ సీరియల్ కోసం చైల్డ్ ఆర్టిస్టులు కావాలని ఇచ్చిన యాడ్ చూసి అప్లై చేశాను. వెయ్యిమందిలో నేను సెలెక్ట్ కావడాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. తర్వాత...?
కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. పెద్దయ్యాక హీరోగా నా మొదటి సినిమా ‘అందం’. ఎమ్మెస్ రెడ్డి నిర్మాత. ఆడియో రిలీజై పెద్ద హిట్ అయ్యింది. కానీ కొన్ని సమస్యల వల్ల విడుదల ఆగిపోయింది.

మరి సీరియల్స్‌వైపు ఎందుకొచ్చారు?

మొదటి సినిమాయే ఆగిపోవడంతో ఎవరూ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాంతో రెండు మూడు సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను. అంతలో టీవీ నటుడు అశోక్ కుమార్ గారి మరదలు ‘గాయత్రి’ నన్ను ఈటీవీ వారికి పరిచయం చేశారు. అప్పుడు ‘ప్రియాంక’లో చాన్స్ వచ్చింది. దానికి దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు గారు. ఇవాళ నన్నో మంచి నటుడిగా గుర్తిస్తున్నారంటే కారణం ఆయనే. నటనంటే ఏమిటో ఆయనే నాకు నేర్పారు.

ఇక్కడైనా కోరుకున్న అవకాశాలు వచ్చాయా?

మొదట్లో ప్రియాంక, జీవన సౌరభం, పంజరం, అలౌకిక, గృహ ప్రవేశం, అగ్నిగుండం... ఇలా వరుసగా సీరియల్సే చేశాను. అప్పట్లో రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ వచ్చే ఈటీవీ సీరియల్స్ అన్నింట్లో నేనే హీరోని.

ఆ ఒక్క చానెల్లోనే ఎందుకు చేసేవారు?

ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. కొంతమందయితే నేను ఆ చానల్ వాళ్ల బంధువునేమో అనుకునేవారు. అదేం కాదు. అవకాశాలు అలా వచ్చాయంతే! నా గురించి అందరికీ తెలిసిందన్నా, ఇవాళ నాకంటూ నేనో కారు కొనుక్కోగలిగానన్నా దానికి కారణం సుమన్‌గారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాఘవేంద్రరావుగారు ‘కల్పన’ సీరియల్‌లో అవకాశమిచ్చారు. వేరే బ్యానర్లో చేసిన మొదటి సీరియల్ అది!నటుడిగా

మీకు తృప్తినిచ్చిన పాత్రలు...?

‘ప్రియాంక’లో చేసిన నెగిటివ్ రోల్. ‘దేవత’లో ఇప్పుడు చేస్తున్న సాఫ్ట్ రోల్. ఈ రెండూ నాకు చాలా పేరు తెచ్చాయి.

కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్?

ఓ అమ్మాయి ఇచ్చింది. తను కడుపులో ఉన్నప్పుడు వాళ్లమ్మగారు ఏదో నాటు మందు వేసుకోవడం వల్ల చూపు లేకుండా పుట్టిందట! నా సీరియల్స్ రెగ్యులర్‌గా వింటుందట. వాళ్ల చెల్లి ఎంబీయే చేయ డానికి హైదరాబాద్ వచ్చి, నా నంబర్ సంపాదించి, ఫోన్ చేసి చెప్పింది. దాంతో ఆమెను కలవడానికి వాళ్ల ఊరెళ్లాను. ‘మీ సీరియల్స్ చూడలేకపోయినా వింటాను. మీ గొంతును బట్టి మీ ఎక్స్‌ ప్రెషన్స్ ఎలా ఉంటాయో నేను చెప్పేయగలను’ అంది. అంతకుమించిన కాంప్లిమెంట్ ఉంటుందా!

సహ నటీనటుల్లో మీకు బెస్ట్‌ఫ్రెండ్స్ ఎవరు?

ఓ సమయంలో నా కెరీర్ దెబ్బతింటే ఫ్రెండ్సనుకున్నవాళ్లెవరకూ కనీసం పలక రించలేదు. అవినాష్ (మా ఇంటి ఆడ పడుచు ఫేమ్) తప్ప! అలాగే క్లిష్ట పరి స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామ్ ‘దేవత’ ప్రాజెక్ట్ వచ్చేలా చేశాడు. వాళ్లే నా ఆప్తమిత్రులు.

ఓ వ్యక్తిగా మీ గురించి..?Krishna_Kaushik1

నేనేదైనా కరెక్ట్ అని నమ్మితే ఎట్టి పరిస్థితు ల్లోనూ మనసు మార్చుకోను. అంతేకాదు, అన్నీ ముఖమ్మీదే చెప్పేస్తాను. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. కొందరు ఫ్రెండ్సయితే లైట్ బాయ్ దగ్గర్నుంచి, డెరైక్టర్ వరకూ అందరితో ఒకేలా ఉంటావేంటని తిడుతుం టారు. ఆ లాజిక్ నాకు అర్థమే కాదు. ఒక్కొక్కరితో ఒక్కోలా ఎందుకుండాలి!మీ తమ్ముడు బాలాదిత్య (చంటిగాడు ఫేమ్) కూడా మీలా సీరియల్స్ వైపు వస్తాడా?
లేదు. తనకి సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం లా చేస్తున్నాడు. తర్వాత మళ్లీ సినిమాల వైపు వెళ్తాడు.

తీరని కోరిక...?

నాకు సంగీతమంటే మహా ఇష్టం. (నవ్వుతూ) అయితే ఏమాత్రం శృతిలో లేకుండా ఘోరంగా పాడతాను. అందుకే కనీసం గిటార్ అయినా నేర్చుకోవా లనుంది. త్వరలోనే మొదలుపెడతాను.

భవిష్యత్ ప్రణాళికలు...?

ఎఫ్.ఎం.కి పనిచేశాను. హీరో శర్వానంద్, రోహిత్‌లకు డబ్బింగ్ చెప్పాను. ఇప్పుడు ఆకాశ్, రిషిలకు చెబుతున్నాను. నటుడిగానూనిరూపించుకున్నాను. రియాల్టీ షోలు చేస్తున్నాను. యాంకర్‌గానూ సక్సెసయ్యాను. ఇక డెరైక్షన్ కూడా చేయాల నుంది. స్క్రిప్టు కూడా సిద్ధం చేస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with prachi desai

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

  • Interview with mogalirekulu fame karuna

    మొగలిరేకులు ఫేం కరుణతో

    May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Tv actor gurmeet choudhary interview

    Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

  • Mogalirekulu ravi krishna interview

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more