పెద్ద పెద్ద కళ్లను గుండ్రంగా తిప్పుతూ, సందర్భానుసారంగా చక్కని హావభావాలను ప్రదర్శిస్తూ, అందమైన నటనతో దరినీ కట్టిపడేస్తుంది... లహరి. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణతిలకం, ముద్దుబిడ్డ తదితర సీరియల్స్ తో మంచి నటిగా పేరు తెచ్చుకుందామె. వెజ్ బిర్యానీ రుచి, గులాబి రంగు, జెనీలియా నటన ఇష్టమంటోన్న లహరి చెప్పిన కబుర్లు...
మీ బ్యాగ్రౌండ్?
నాన్న ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తారు. వాళ్లకి నేనొక్కదాన్నే. పుట్టింది, పెరిగింది... అంతా హైదరాబాద్‌లోనే. మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చేశాను.
నటన మీద ఆసక్తి ఎలా కలిగింది?
ప్రత్యేకంగా నటన మీద ఆసక్తి అంటూ ఏం లేదు. స్కూల్లో డ్యాన్స్ నేర్చుకునేదాన్ని. ఏడో తరగ తిలో ఉన్నప్పుడు ‘అర్జున్’ సినిమాలో అవకాశముందంటూ మా డ్యాన్‌స టీచర్ నన్ను తీసుకెళ్లారు. సెలెక్ట్ అవడంతో నటినైపోయాను.
మరి సీరియల్స్ కి ఎలా వచ్చారు?
అదీ అనుకోకుండానే జరిగింది. పదో తరగతి పరీక్షలయ్యాక పేపర్లో మోడల్ కావాలంటూ వచ్చిన యాడ్ చూశాను. సెలవులే కదా అని ఫొటోషూట్‌కి వెళ్లాను. ఆ ఫొటోలు చూసి ఈటీవీలో శుభాకాంక్షలు ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా తీసుకున్నారు. అది చూసి శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు ‘చక్రవాకం’లో అవకాశమిచ్చారు.
తర్వాతేం సీరియల్స్ చేశారు?
రాధ-మధు, లయ, సావిరహే, మొగలిరేకులు, డాక్టర్ చక్రవర్తి, కళ్యాణ తిలకం... ఇప్పుడు ముద్దుబిడ్డ.
సినిమాల్లో స్థిరపడాలని ఎందుకనుకోలేదు?
నిజానికి మొదట్లో నాకు హీరోయిన్‌గా అవకాశాలొచ్చాయి. కానీ సినిమాలంటే గ్లామరస్‌గా కనిపించక తప్పని పరిస్థితి కదా! అందుకే వెనకడుగు వేశాను. మంచి అవకాశం వస్తే చేస్తున్నాను. మనోరమ, ఆరెంజ్, కందిరీగ చిత్రాల్లో చేసినవి అలాంటి మంచి పాత్రలే!
ఇంతవరకూ చేసిన పాత్రల్లో సంతృప్తినిచ్చింది?
‘రాధ-మధు’లో చేసినది. మామూలు పాత్రలకు భిన్నంగా అల్లరి పిల్లగా, సరదా సరదాగా ఉంటుందది. నేను దాన్ని చాలా ఎంజాయ్ చేశాను. నంది, ఆకృతి అవార్డులు కూడా అందుకున్నాను.
ఎందుకు చేశానా అని బాధపడిన పాత్ర?
శుభాకాంక్షలు అనే సీరియల్లో భర్తను విపరీతంగా వేధించే భార్యగా చేశాను. అంతవరకూ నన్ను నెమ్మదిగా, అణకువగా ఉండే అమ్మాయిగా చూసిన ప్రేక్షకులు నెగిటివ్‌గా చూడలేకపోయారు. మీరు మంచి పాత్రలు చేస్తారు కదా, ఎందుకిలా చేస్తున్నారని చాలామంది అడిగేవారు. అలాంటప్పుడు అనవసరంగా ఒప్పుకున్నానే అని బాధనిపించేది. కానీ నిజం చెప్పాలంటే, నెగిటివ్ పాత్రలో మనల్ని చూసి జనం తిడుతున్నారంటే, దానికి మనం న్యాయం చేసినట్టు లెక్క!
అత్యంత సంతోషపెట్టిన కామెంట్?
జీ తెలుగులో ‘చిత్తం చిత్తం ప్రాయశ్చిత్తం’ కార్యక్రమానికి వెళ్లాను. అందులో నటుడు శివారెడ్డి యముడిగా చేస్తున్నారు. ఆయన అన్నారు- నువ్వు బుల్లితెర సౌందర్యవి అయిపోయావు, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నావు అని. అంత గొప్ప కాంప్లిమెంట్‌ని నేను ఊహించలేదు. చాలా సంతోషమేసింది.
నటిగా మీ రోల్‌మోడల్?
రోల్‌మోడల్ అని అనను కానీ, ఓ పాత్రకు జెనీలియా నాకు స్ఫూర్తినిచ్చారు. ‘రాధ-మధు’లో నా క్యారెక్టరైజేషన్ ‘బొమ్మరిల్లు’లో హాసినికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పాత్రకు జెనీలియా నటన నుంచి స్ఫూర్తి పొందాను.
మీ ప్లస్/మైనస్ పాయింట్స్?
నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఏదైనా ఎందుకు చేయలేను అనుకుంటాను. పట్టుదలగా ప్రయత్నిస్తాను. ‘చక్రవాకం’లో ఎంపికయ్యే నాటికి నాకు నటన అంతగా రాదు. జైకుమార్ అనే డెరైక్టర్ బాగా తర్ఫీదునిచ్చారు. మెల్లగా నేను బాగా నటించగలను అన్న నమ్మకం కలిగింది. అన్నీ పాజిటివ్‌గా తీసుకుంటాను కాబట్టి, మైనస్‌ల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా?
సీరియల్లో హీరోయిన్ అంటే ఎప్పుడూ బాధపడుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దానికి భిన్నంగా హుషారుగా ఉండే హీరోయిన్ పాత్ర చేయాలనుంది. ఓ రకంగా ‘కళ్యాణతిలకం’లో చేసిన రోల్ కాస్త అలాగే ఉంటుంది. మొదట ఏడ్చినా, తర్వాత అందరినీ ఏడిపిస్తుంది. కానీ కొంతవరకే అలా! అలా కాకుండా పూర్తి స్థాయిలో సరదా పాత్ర చేయాలనుంది.
పుట్టినరోజు: డిసెంబర్ 8
నచ్చే రంగులు: గులాబి, పర్పుల్
నచ్చే ఆహారం: వెజ్ బిర్యానీ, వెజ్ మంచూరియా
నచ్చే దుస్తులు: ప్యాంట్స్, షర్ట్స్
నచ్చిన సినిమా: కిక్... భలే కామెడీ!
నచ్చే హీరోలు: మహేశ్‌బాబు, రామ్, సిద్ధార్థ
నచ్చే హీరోయిన్లు: జెనీలియా, సమంత
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more
Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more