భారతీయ మార్కెట్లో 2019లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో షావోమి సంస్థ ఫోన్లు టాప్ ప్లేస్ సాధించాయి. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో సంచలనాలు సృష్టించిన మోడల్స్ లో ఒకటి షావోమీకి చెందిన రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్. షావోమీ అత్యధికంగా అమ్మిన స్మార్ట్ ఫోన్ ఇదేనని రికార్డులు చెబుతున్నాయి. అంతలా యూజర్లను ఆకట్టుకుంది ఈ ఫోన్ పై సంస్థ తాజాగా భారీ డిస్కౌంట్ ధరకు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఫోన్ రిలీజ్ అయినప్పుడు 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.16,999. కానీ ఇప్పుడు ఈ ఫోన్ భారీ డిస్కౌంట్‌ను సంస్థ అందిస్తోంది. ఇదివరకు ఒక్కసారి మాత్రమే ధరను తగ్గించింది షావోమీ. అన్ని వేరియంట్లపై రూ.2,000 వరకు తగ్గింపు ప్రకటించింది. మార్కెట్ లోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ కు క్రేజ్ తగ్గలేదు. రెడ్మీ నోట్ 8 సిరీస్ వచ్చినా ఈ మోడల్ కు మాత్రం డిమాండ్ అలాగే కొనసాగింది.
తాజాగా 'నెంబర్ 1 ఎంఐ ఫ్యాన్' సేల్‌లో భాగంగా రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది షావోమీ. మూడు వేరియంట్లపై ఊహించని డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్మీ నోట్ 7 ప్రో రూ.10,000 లోపు లభించడం ఇదే మొదటిసారి. ఈ నెంబర్ 1 ఫ్యాన్ లో భాగంగా విక్రయిస్తున్న రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర ఏకంగా మూడు వేల రూపాయలు తగ్గింది. బేసిక్ వేరియంట్ పై చూస్తే 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.14,999.
షావోమీ ఇండియా ఎంఐ స్టోర్ లో ఈ ఫోన్ కొనేవారికి మరో సర్ప్రైజ్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ లో రెడ్మీ నోట్ 7 ప్రో కొంటే అదనంగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మోడల్ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్సే. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే లాంటి ప్రత్యేకలే కారణం. దీనికి తోడు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
48 మెగాపిక్సెల్ కెమెరా తో పాటు మరో 5 మెగాపిక్సల్ కెమెర వెనుక బాగంలో పోందుపర్చిన సంస్థ.. ముందువైపున సెల్సీలు తీసేందుకు వీలుగా 13 మెగాపిక్సల్ కెమారను పొందుపర్చింది. ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. త్వరలో ఎంఐయూఐ 11 అప్డేట్ రానుంది. రెడ్మీ నోట్ 7 ప్రో నెబ్యులా రెడ్, నెప్ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్ ఆస్ట్రో మూన్లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more