Airtel's Wi-Fi calling service now reaches Telugu states తెలుగురాష్ట్రాలకు ఎయిర్ టెల్ కొత్త సదుపాయం.. వైఫై కాలింగ్

Xiaomi announces no 1 mi fan sale with discounts deals

Bharti Airtel, Airtel, WiFi calling, voWiFi, Andhra Pradesh, Telangana, Airtel Broadband, Xstream Fiber, Tamil Nadu, Mumbai, Kolkata, Karnataka, Business, Economy, E-Commerce, Technology

Bharti Airtel had recently launched its Voice Over Wi-Fi (VoWiFi) service -- Airtel Wi-Fi Calling -- in India. The company has now added a few more phones to the list of compatible ones. The service which was earlier provided only in Delhi-NCR is now available in Telangana and Andhra Pradesh.

తెలుగురాష్ట్రాలకు ఎయిర్ టెల్ కొత్త సదుపాయం.. వైఫై కాలింగ్

Posted: 12/23/2019 06:50 PM IST
Xiaomi announces no 1 mi fan sale with discounts deals

తెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ మరో సదుపాయాన్ని దగ్గర చేసింది. ఇన్నాళ్లు కేవలం ఢిల్లీ వరకు మాత్రమే పరిమితమైన వైఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకు వచ్చామని పేర్కొంది. మరింత మెరుగైన వాయిస్ కాలింగ్ అనుభూతి కలుగుతుందని, ఏ నెట్ వర్క్ లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొంది.

ఈ విషయాన్ని ఎయిర్ టెల్ తెలుగు రాష్ట్రాల సీఈఓ అన్వీస్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు తొలుత అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక ఈ సదుపాయం పొందేందుకు ఎటువంటి యాప్ అవసరం లేదని, వైఫై కాలింగ్ కు మద్దతిచ్చేలా తాజా వర్షన్ కు ఫోన్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకుంటే చాలని అన్వీస్ సింగ్ వెల్లడించారు. ఈ వై-ఫై కాలింగ్ సేవలను పొందేందుకు తొలుత వివోఎల్టీఈ సర్వీసును అన్ చేసుకోవాలి. ఆపై మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో వైఫై కాలింగ్ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. అదెలా అంటే..

మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సిమ్ అండ్ నెట్ వర్కింగ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఎయిర్ టెల్ సిమ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓ పాప్ అప్ బాక్స్ లో యాక్టివేట్ మేక్ కాల్స్ యూజింగ్ వైఫై అనే అప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వైఫై కాల్స్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం ఐఫఓన్ ఎక్స్ అర్, 6ఎస్ ఆపై వెలువడిన అన్ని యాపిల్ ఫోన్లతో పాటు, శాంసంగ్ జే6, ఏ 10, ఒన్ 6, ఎస్ 10, ఎస్ 10 ప్లస్, ఎస్ 10ఈ, ఎం 20లతో పాటు వన్ ప్లస్ 7 సీరీస్ ఫోన్లు, రెడ్ మీ 5, కే 20, కే 20 ప్రో, షావోమి పోకో ఎఫ్1 ఫోన్లన్నీ ఈ వైవై కాలింగ్ ను సపోర్ట్ చేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airtel  WiFi calling  voWiFi  Andhra Pradesh  Telangana  Airtel Broadband  Xstream Fiber  Business  Economy  E-Commerce  

Other Articles