Cyrus Mistry back as chairman of Tata Group సైరస్ మిస్త్రీకే మళ్లీ టాటా చైర్మన్ పగ్గాలు..

Nclat restores cyrus mistry as chairman of tata group

tata group,Tata Sons, tata group change, cyrus mistry, N Chandrasekaran, Business

n appeals court upheld charges by Cyrus Mistry that he was improperly ousted as chairman of the $110 billion Tata Group, paving the way for his reinstatement and marking a loss for the conglomerate’s chairman emeritus Ratan Tata.

సైరస్ మిస్త్రీకే మళ్లీ టాటా చైర్మన్ పగ్గాలు..

Posted: 12/18/2019 09:09 PM IST
Nclat restores cyrus mistry as chairman of tata group

టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని మళ్లీ నియమిస్తున్నట్లు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌క్లాట్‌) ప్రకటించింది. దాదాపు మూడేళ్ల తర్వాత మిస్త్రీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియామకాన్ని ఎన్‌క్లాట్‌ నిలుపుదల చేసింది. ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్ట విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.

2016 అక్టోబరు 24న మిస్త్రీని తొలగించారు. కార్పొరేట్‌ నియమ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపిస్తూ మిస్త్రీ న్యాయపోరాటం మొదలు పెట్టారు.  అదే ఏడాది డిసెంబరు 19న టాటా గ్రూప్‌ అన్ని సంస్థల డైరెక్టర్‌గా మిస్త్రీ రాజీనామా చేశారు. 20న ఎన్‌క్లాట్‌ను ఆశ్రయించారు. మిస్త్రీని తొలగించడం చట్టవిరుద్ధమని ఎన్‌క్లాట్‌ పేర్కొంది. మిస్త్రీ పునర్నియామక ఉత్తర్వులు నాలుగు వారాల తర్వాత అమల్లోకి రానున్నాయి. ఈలోపు టాటా సంస్థ అప్పీల్‌కు దాఖలు చేసుకోవచ్చని ఎన్‌క్లాట్‌ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tata group  Tata Sons  tata group change  cyrus mistry  N Chandrasekaran  Business  

Other Articles