Karbonn launches budget VR headset with Quattro L52, Titanium Mach Six

Karbonn quattro l52 titanium mach six launched with vr headsets in india

virtual reality, vr, vr headset, karbonn vr headset, karbonn quattro l52, quattro l52 price, quattro l52 features, quattro l52 specs, karbonn mach six price, karbonn mach six features, karbonn mach six specs, smartphones, technology, technology news

Karbonn has announced its VR glasses to be available with Quattro L52 and Titanium Mach Six.

వీఆర్ విభాగంలో చేరిన కార్భన్ స్మార్ట్ ఫోన్.. ధర కూడా చౌక..

Posted: 04/13/2016 03:08 PM IST
Karbonn quattro l52 titanium mach six launched with vr headsets in india

దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ కార్బన్ కూడా వర్చ్యువల్ రియాలిటీ విభాగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వినియోగదారుల ఈ వర్చ్యువల్ రియాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో తాము ఈ రంగంలోకి ప్రవేశించామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాచిన్ దేవ్సారె అన్నారు. ఈ విభాగం అత్యంత పెద్ద విభాగంతా పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత నాణ్యతతో కూడిన విఆర్ హెడ్ సెట్ ను అందిస్తున్నామని చెప్పారు, తక్కువ ధరలకే నాణ్యమైన స్మార్ట్ ఫోన్లను వీఆర్ విభాగంతో కూడినవే అందిస్తామన్నారు.

ఇక తాము తాజాగా అందిస్తున్న రెండు కొత్త స్మార్ట్ ఫోన్లకు కూడా వీఆర్ యాప్ కలిగినవేనన్నారు.  తాజాగా ‘క్వాట్రో ఎల్52’, ‘టైటానియం మాక్ 6’ అనే రెండు వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.8,790గా, రూ.7,490. కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు వీఆర్ హెడ్‌సెట్స్ (వీఆర్ గ్లాసెస్)ను ఉచితంగా అందిస్తోంది. దీంతో కార్బన్ కూడా వీఆర్ విభాగంలోకి ప్రవేశించినట్లయ్యింది. కాగా, ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలతో పోటీపడుతూ కార్బన్ కూడా ఏబిఎస్ ప్లాస్టిక్ ఫైబర్ తో కూడిన రెండు కాన్వెక్స్ లెన్సులను అమర్చిన ‘వర్చ్యువల్ రియాలిటీ’ హెడ్‌సెట్స్ అందిస్తుంది.

* ‘క్వాట్రో ఎల్52’: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 4జీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,250 ఎంఏహెచ్ బ్యాటరీ, వీఆర్ యాప్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

* ‘టైటానియం మాక్ 6’: 5.1 లాలీపాప్ ఓఎస్, 6 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్, 3జీ, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 3 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karbonn  smart phones  andriod phones  karbonn mobiles  Quattro L 52  titanium Mach 6  

Other Articles