BlackBerry to launch two mid-range Android phones, says CEO

Blackberry s hail mary throw with two new smartphones

blackberry, blackberry android phones, blackberry android phone, blackberry new android, bbm, bb, blackberry priv discount, blackberry priv review, technology, technology news

BlackBerry is working on two mid-range Android smartphones this year, one with a physical keyboard and one with a touchscreen and plans to launch them this year

బ్లాక్బెర్రీ నుంచి త్వరలో రెండు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లు

Posted: 04/10/2016 12:38 PM IST
Blackberry s hail mary throw with two new smartphones

బ్లాక్బెర్రీ నుంచి మరో రెండు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే తన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ప్రివ్ పేరుతో రిలీజ్ చేసిన బ్లాక్బెర్రీ.. తక్కువ ధరలో ఫోన్ ను అందుబాటులో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన బ్లాక్బెర్రీ సీఈఓ జాన్ చెన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రివ్ ధర ఎక్కువ ఉండటంతో పాటు, దానికి తోడు నిలబడే మరో ఫోన్ ఏదీ సంస్థ నుంచి లేకపోవడం వల్లే విజయం సాధించలేకపోయిందని చెప్పారు.

బ్లాక్బెర్రీ ఓఎస్10 విజయంపై స్పందిస్తూ మొబైల్స్లో భారీ విజయాన్ని సాధించలేకపోయినా.. ప్రభుత్వాలు ఈ ఓఎస్ను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాయని తెలిపారు. మిగతా ఫోన్ల మాదిరి బ్లాక్బెర్రీ ఇండియాలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. రాబోయే ఆండ్రాయిడ్ మొబైల్ ధర ఇండియాలో రూ.25,000లు ఉంటుందని తెలిపారు. దీంతో మొబైల్ అభిమానులలో మరిన్ని ఆశలు పెంచారు. ఇక బ్లాక్బెర్రీ కొత్త ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం అభిమానుల వంతుగా మారింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Blackberry  Android  Phone  Price  

Other Articles