భారత స్మార్ట్ ఫోన్ విఫణిలోకి మరో కోత్త అవిష్కరణ త్వరలో జరగనుంది, మన మొబైల్ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొబైల్ తయారీ సంస్థ నెక్స్ట్ బిట్ తన నుంచి రాబిన్ అనే కొత్త ఫోన్ను ఈ ఏప్రిల్ మాసం చివరి నుంచి భారతీయ మార్కెట్లో ప్రవేశపెడతామని ప్రకటిస్తున్నారు, ఈ నెల చివరి నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు సంస్థ వర్గాలు స్సష్టం చేశాయి.
దీని ధర రూ.27 వేలు(399డాలర్లు) ఉండనుంది. నెక్స్ట్ బిట్ రాబిన్ ఫోన్ లో పరిమితి లేకుండా క్లౌడ్ స్టోరేజీ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెరికా మార్కెట్లో 2015లోనే అడుగుపెట్టింది. వినియోగ దారుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఫోన్ అమ్మకాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తయారీ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మొబైల్ రంగానికి అమిత ఆధరణ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు.
ఫోన్ ప్రత్యేకతలు
* 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్పేస్ ఫర్ స్టోరేజ్
* 5.2 అంగుళాల పూర్తి స్థాయి హెచ్ డీ ఎల్సీడీ తెర(దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్)
* 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ
* ఫింగర్ ప్రింట్ ఐడీ స్కానర్
* 13 మెగాపిక్సల్ రీర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more