మేకిన్ ఇండియా పేరు ఎన్నిసార్లు ఉచ్చరించినా, రైల్వేల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపుతున్నట్టు వెల్లడించినా, ఐటీ సంస్థలకు పని కల్పించేలా 'స్మార్ట్' పదాన్ని పలుమార్లు వాడినా సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయింది. రైల్వేలతో సంబంధమున్న కంపెనీలతో పాటు, మౌలిక రంగంలోని కంపెనీలు, ఐటీ, బ్యాంకింగ్ రంగంలో కొనుగోలు మద్దతు కనిపించకపోవడంతో సూచికలు నష్టపోయాయి.
సురేష్ ప్రభు ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే భారీ నష్టాల దిశగా సాగిన సూచికలు, ఆపై యూరప్ మార్కెట్ సరళిని చూసిన తరువాత కాస్తంత తేరుకున్నాయి. ఆ తరువాత కూడా ఒడిదుడుకులు కొనసాగి స్వల్ప నష్టాల్లో సెషన్ ను ముగించాయి. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 112.93 పాయింట్లు పడిపోయి 0.49 శాతం నష్టంతో 22,976.00 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 48.10 పాయింట్లు పడిపోయి 0.69 శాతం నష్టంతో 6,970.60 పాయింట్ల వద్దకు చేరాయి.
బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 0.91 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఐడియా, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీలు లాభపడగా, పవర్ గ్రిడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఏసీసీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,623 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 934 కంపెనీలు లాభాల్లోను, 1,532 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 86,58,842 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ మంగళవారం నాడు రూ. 86,14,175 కోట్లకు తగ్గింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more