రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ క్లాసిక్ 500 మోడల్లో కొత్త స్క్వాడ్రన్ బ్లూ కలర్ వేరియంట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ రెండు మోడళ్లలో భారత కస్టమర్లను అకర్షిచింది. ముఖ్యంగా యువతను అధికంగా అకర్షించి ఈ మోడళ్లు అమ్మకాలలో దూసుకుపోతున్నాయి. దీంతో క్లాసిక్ 500 లో కొత్త వేరియంట్ ను తీసుకువచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్. భారత వైమానిక దళానికి అంకితమిస్తూ... ఈ వేరియంట్‌ను అందిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఈ డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ చెప్పారు. ధర రూ.1,93,372గా (ఆన్ రోడ్ ధర, ముంబై) నిర్ణయించామని పేర్కొన్నారు. రంగులో మాత్రమే మార్పు చేశామని మిగిలిన ఇతర అంశాల్లో ఎలాంటి మార్పులు, చేర్పుల్లేవని పేర్కొన్నారు. 500 సీసీ ఇంజిన్ ఉన్న ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 గేర్లు తదితర ఫీచర్లున్నాయని తెలిపారు. వైమానిక దళ పోలీసులు అధికంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను వినియోగించుకునేవారన్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more