Sensex heads for fourth session of gains, but mood cautious

Sensex rises for 4th consecutive day nifty fails to hold 7250

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Experts feel the market may remain rangebound ahead of expiry of February derivative contracts due on February 25 and Union Budget that is scheduled to be announced on February 29.

వరుసగా నాల్గవ రోజు లాభాల్లో దేశీయ సూచీలు

Posted: 02/22/2016 06:41 PM IST
Sensex rises for 4th consecutive day nifty fails to hold 7250

భారత స్టాక్ మార్కెట్ బుల్ పరుగు కాస్తంత నిదానించినా ఎట్టకేలకు లాభాల్లోనే కొనసాగింది. గత వారాంతంలో వరుసగా మూడు రోజు లాభాలను నమోదు చేసిన మార్కెట్లు ఇవాళ్ల కూడా లాభాలను ఆర్జించాయి. మొదట్లో క్రితం ముగింపు వద్దే కనిపించిన సెన్సెక్స్, నిఫ్టీ, ఆపై భారీ లాభాల దిశగా సాగినప్పటికీ, చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభానికి పరిమితమయ్యాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 79.64 పాయింట్లు పెరిగి 0.34 శాతం లాభంతో 23,788.79 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 26.30 పాయింట్లు పెరిగి 0.36 శాతం లాభంతో 7,237.05 పాయింట్ల వద్దకు చేరాయి.

ఇవాళ్టి ట్రేడింగ్ లో మొత్తం 2,701 కంపెనీల షేర్లు ట్రేడ్ కాగా, 1,398 కంపెనీల షేర్లు లాభాల్లోను, 1,398 కంపెనీల షేర్లు నష్టాల్లోనూ నడిచాయి. గత వారాంతం ముగింపు రూ. 88,54,658 కోట్లుగా నమోదు కాగా, ఇవాళ్టి ట్రేడింగ్ లో లాభాలను ఆర్జించిన మార్కెట్ రూ. 89,03,618 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.75 శాతం, స్మాల్ క్యాప్ 0.46 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 28 కంపెనీలు లాభాల్లో నడిచాయి. హిందుస్థాన్ యూనీలివర్, బోష్ లిమిటెడ్, అల్ట్రా సిమెంట్స్, జడ్ఈఈఎల్, సన్ ఫార్మా తదితర కంపెనీల షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, గెయిల్, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles